కామాంధుల కోరల్లో చిక్కి, మరో ఆడపిల్ల బలైపోయింది. లైంగిక వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన తమిళనాడులో(Tamil nadu girl suicide) జరిగింది.
లేఖ రాసి పెట్టి..
కరూర్ జిల్లాలో 12వ తరగతి చదివే ఓ బాలిక శుక్రవారం సాయంత్రం తన ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. బాలిక చనిపోయే ముందు వ్యక్తిగత డైరీలో ఓ లేఖ రాసిపెట్టింది. దాంట్లో తాను లైంగిక వేధింపులు గురయ్యానని పేర్కొంది.
ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించి.. ఆమె చదివే పాఠశాలలో జిల్లా విద్యా శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక వాట్సాప్ చాట్‌ను సైబర్ పోలీసులు పరిశీలిస్తున్నారు.
గతవారం కోయంబత్తూర్‌లో ఇదే తరహా ఘటన జరిగింది. ఓ ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో నిందితుడిని, స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి:
ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు.. 10 నెలల్లో రెండు రేప్ కేసులు!