ETV Bharat / bharat

జయలలితకు మోదీ, పళనిస్వామి నివాళులు - Sashikala latest

తమిళనాడు మాజీ సీఎం జయలలిత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి పళనిస్వామి, నివాళులు అర్పించారు. దివంగత నేత విగ్రహానికి పూల మాలలు వేసి స్మరించుకున్నారు.

Tamil Nadu CM Palaniswami garland the statue of former CM J Jayalalithaa on her birth anniversary
జయలలిత జయంతికి ప్రధాని, సీఎం సహా పలువురు నివాళులు
author img

By

Published : Feb 24, 2021, 11:35 AM IST

Updated : Feb 24, 2021, 11:48 AM IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా.. ఆ రాష్ట్ర సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ ​సెల్వం నివాళులు అర్పించారు. చెన్నైలోని ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేశారు.

Tamil Nadu CM Palaniswami garland the statue of former CM J Jayalalithaa on her birth anniversary
జయలలిత విగ్రహానికి పూలమాల సమర్పిస్తున్న పళనిస్వామి, పన్నీర్​ సెల్వం

జయలలిత నెచ్చెలి, బహిష్కృత ఏఐఏడీఎంకే నేత శశికళ కూడా జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి శశికళతో పాటు టీటీవీ దినకరన్​ కూడా హాజరయ్యారు.

Sashikala
జయలలిత చిత్రపటానికి పూలహారం వేస్తున్న శశికళ

జయలలిత జయంతి సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను గుర్తుచేసుకున్నారు. జయలలితాజీ ప్రజా అనుకూల విధానాలతో అట్టడుగువర్గాల వారిని శక్తిమంతం చేసేందుకు కృషి చేశారని అన్నారు. నారీ శక్తిని బలోపేతం చేసేందుకు ఆమె గొప్పగా ప్రయత్నించారని ట్వీట్​ చేశారు.

PM Modi tweet
ప్రధాని మోదీ ట్వీట్​

ఇదీ చదవండి: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు

Last Updated : Feb 24, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.