ETV Bharat / bharat

'తాజ్​మహల్​లో హిందూ దేవతా విగ్రహాలు' పిటిషన్ కొట్టివేత - తాజ్​మహల్ 22 గదులు

Taj Mahal 22 rooms case: తాజ్​మహల్​లోని 22 గదుల్లో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్​ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. గదులను తెరిచేలా పురావస్తు శాఖ అధికారులను ఆదేశించాలని దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

TAJ MAHAL  22 ROOMS
TAJ MAHAL 22 ROOMS
author img

By

Published : May 12, 2022, 3:45 PM IST

Updated : May 12, 2022, 7:42 PM IST

Taj Mahal 22 rooms case: తాజ్​మహల్​లో మూసి ఉన్న 22 గదులను తెరవాలంటూ దాఖలు చేసిన పిటిషన్​ను అలహాబాద్ హైకోర్టు లఖ్​నవూ బెంచ్ కొట్టేసింది. తాజ్‌మహల్‌లోని 22 గదుల్లో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోందని పేర్కొంటూ భాజపా యువజన విభాగం మీడియా ఇంఛార్జ్ రజనీశ్ సింగ్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఆ గుట్టు తేల్చడానికి గదులను తెరిచేలా భారత పురావస్తు శాఖ అధికారులను ఆదేశించాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఈ విషయంపై నిజనిర్ధరణ కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టును కోరారు. అనంతరం ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియాతో దీనిపై నివేదిక ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, అలహాబాద్ హైకోర్టు.. పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. 'రేపు మీరు వచ్చి మా ఛాంబర్లను చూడటానికి అనుమతి అడుగుతారు. దయచేసి పిల్ వ్యవస్థను అపహాస్యం చేయొద్దు. ఈ అంశాన్ని చరిత్రకారులకు వదిలేద్దాం' అని వ్యాఖ్యానించింది.

Taj Mahal 22 rooms history: తాజ్‌మహల్‌పై హిందూ వర్గాల్లో జరుగుతున్న విస్తృత ప్రచారాన్ని కోర్టు ముందు ఉంచిన పిటిషనర్‌ ప్రస్తుత తాజ్‌మహల్‌ స్మారకం ఒకప్పుడు శివాలయమన్న హిందూ సమూహాల వాదనలను ప్రస్తావించారు. కొన్ని హిందూ సమూహాలు ఇప్పటికీ శివుడి తేజో మహాలయంగా తాజ్‌మహల్‌ను విశ్వసిస్తున్నారని కోర్టుకు గుర్తుచేశారు. నాలుగు అంతస్తులు ఉన్న తాజ్‌మహల్‌లో ఎగువ.. దిగువ భాగాల్లో సుమారు 22 గదులు మూసి ఉన్న స్థితిలో ఉండటాన్ని పిటిషనర్‌ కోర్టుకు గుర్తు చేశారు.

ఇవి దశాబ్దాల కాలంగా మూసి ఉన్నాయన్న పిటిషనర్‌.. వీటి లోపల హిందూ దేవుళ్లు ఉన్నట్లు అనేక మంది చరిత్రకారులు, కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తున్నారన్నారు. ఆ గదుల్లోనే పరమేశ్వరుడు కొలువుదీరి ఉన్నారని నమ్ముతున్నట్లు కోర్టుకు తెలిపారు. భద్రతా కారణాల వల్లే ఆ గదులను మూసినట్లు ఆగ్రాలోని పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికను సైతం పిటిషనర్‌ కోర్టుకు సమర్పించారు. ఇన్ని ప్రశ్నలు, విశ్వాసాలు, తాజ్‌మహల్‌ చుట్టూ పెన వేసుకొని ఉన్న నేపథ్యంలో వాటి గుట్టును విప్పేందుకు కోర్టుకు చొరవ తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. చారిత్రక స్మారకాలు, పురావస్తు ప్రాంతాలు వంటివాటికి సంబంధించి 1951, 1958 చట్టాల్లోని కొన్ని నిబంధనలను కూడా పక్కనపెట్టాలని రజనీశ్‌ సింగ్‌ పిటిషన్‌లో కోరారు. ఈ చట్టాల పరిధిలోనే తాజ్‌మహల్‌, ఆగ్రా కోట వంటివాటిని చారిత్రక స్మారకాలుగా ప్రకటించారు.

ఇదీ చదవండి:

Last Updated : May 12, 2022, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.