ETV Bharat / bharat

తాజ్​ ఎక్స్​ప్రెస్​లో​ బాంబు కలకలం, రెండు గంటలు వెతికిన తర్వాత - Taj Express

Taj Express ఉత్తర్​ప్రదేశ్​ మథురాలో తాజ్​ ఎక్స్​ప్రెస్​లో బాంబు కలకలం రేగింది. తాజ్​ ఎక్స్​ప్రెస్​లో బాంబు ఉన్నట్లు ఓ వ్యక్తి కాల్​ చేసి బెదిరించాడు. అధికారులు అప్రమత్తమై రైలులోని ప్రయాణికులందరిని కిందకు దించి తనిఖీలు చేశారు.

fake bomb threat in taj express
fake bomb threat in taj express
author img

By

Published : Aug 17, 2022, 9:13 AM IST

Taj Express: స్వాతంత్ర్య దినోత్సవాన తాజ్​ ఎక్స్​ప్రెస్​లో బాంబు కలకలం రేగింది. దిల్లీ నుంచి బౌంద్​ వెళ్లే తాజ్​ ఎక్స్​ప్రెస్​లో బాంబు ఉన్నట్లు ఓ వ్యక్తి కాల్​ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. రైలులోని ప్రయాణికులందరిని కిందకు దించి తనిఖీలు చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మథురాలో జరిగింది. సోమవారం.. తాజ్​ ఎక్స్​ప్రెస్​లోని డీ2 బోగిలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్​ చేశారని జీఆర్పీ పోలీసులు తెలిపారు. దిల్లీ వెళ్లే లోపు పేలుతుందని హెచ్చరించారని చెప్పారు. వెంటనే అప్రమత్తమై రైలును మథురా రైల్వే స్టేషన్​లో నిలిపి తనిఖీలు చేశామని పేర్కొన్నారు.

"తాజ్​ ఎక్స్​ప్రెస్​.. మథురా జంక్షన్​ రైల్వే స్టేషన్​కు ఉదయం 7:29 కు చేరుకోగానే నిలిపివేశాం. ప్రయాణికులను కిందకు దించి పూర్తిగా తనిఖీలు చేశాం. బాంబ్​ డిస్పోజల్​ స్క్వాడ్​, డాగ్​ స్క్వాడ్​, జీఆర్పీ, ఆర్పీఎఫ్​, స్థానిక పోలీసులతో కలిసి ప్రతి కోచ్​ను తనిఖీ చేశాం. దీనికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. తనిఖీలు చేపట్టిన అనంతరం రైలు వెళ్లేందుకు అనుమతిచ్చాం" అని స్టేషన్​ హౌస్​ ఆఫీసర్​ సుశీల్​ కుమార్​ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. నిందితుడిని గుర్తించారు. షాహన్​గంజ్​ ప్రాంతానికి చెందిన ముఖేశ్​ను అరెస్ట్​ చేశారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: కాంగ్రెస్​కు అజాద్​ షాక్​, పార్టీ ఆఫర్​ తిరస్కరణ

జైలు ఎదుట బిడ్డ మృతదేహంతో తల్లి ఆవేదన, భర్త కోసం 7 గంటలు నిరీక్షించి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.