ETV Bharat / bharat

ఐదేళ్ల పాపపై హత్యాచారం- 5 రోజుల్లోనే శిక్ష ఖరారు - సూరత్ కోర్టు న్యూస్ టుడే

ఐదేళ్ల పాప హత్యాచార కేసులో 5 రోజుల్లోనే తీర్పు వెలువరించింది సూరత్​లోని పోక్సో కోర్టు. నిందితుడికి యావజ్జీవ ఖారాగార శిక్ష ఖరారు చేసి రూ. లక్ష జరిమానా కూడా విధించింది.

court
కోర్టు
author img

By

Published : Nov 12, 2021, 5:45 AM IST

Updated : Nov 12, 2021, 7:49 AM IST

గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో పోక్సో కోర్టు ఒకటి చరిత్ర సృష్టించింది. ఐదేళ్ల పాప హత్యాచార కేసులో.. కేవలం ఐదు రోజుల్లో విచారణ పూర్తిచేసి శిక్ష ఖరారు చేసింది. నగరంలోని సచిన్‌ జీఐడీసీ ప్రాంతంలో గత నెల 12న హనుమాన్‌ అలియాస్‌ అజయ్‌ మంగి నిషదె (39) అనే వ్యక్తి.. పళ్లరసం ఇస్తానంటూ ఓ పాపను పిలిచాడు. సమీపంలోని పారిశ్రామిక పార్కులోకి తీసుకువెళ్లి బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆపై గొంతు నులిమి చంపేశాడు.

ఈ కేసులో పోక్సో కోర్టు రాత్రి 11 గంటల వరకూ వాదనలు ఆలకించింది. అజయ్‌కి అదనపు సెషన్స్‌ జడ్జి ప్రకాశ్‌ చంద్ర కాలా తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేశారు. రూ.లక్ష జరిమానా కూడా విధించారు. సెలవులు తీసేస్తే సాంకేతికంగా 5 రోజుల్లోనే తీర్పు వచ్చినట్లవుతుందని జిల్లా చీఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నయన్‌ సుఖద్‌వాలా తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు అందినప్పటి నుంచి చూస్తే 30 రోజుల్లోనే శిక్ష ఖరారైందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

బాలికపై సామూహిక అత్యాచారం.. ఆపై గొంతు నులిమి..

'మతహింస లావాలాంటిది.. నేనూ అల్లర్ల బాధితుడినే'

Last Updated : Nov 12, 2021, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.