ETV Bharat / bharat

వాట్సాప్‌ గ్రూప్‌లకు దూరంగా సుప్రీంకోర్టు! - వాట్సాప్ వినియోగం నిలిపేయనున్న సుప్రీం కోర్టు

ఇటీవల తీసుకొచ్చిన ఐటీ నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు విచారణలకు సంబంధించిన విషయాలను పంచుకునేందుకు, వాటి వీడియో కాన్ఫరెన్సుల సమాచారాన్ని పంపించేందుకు వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది.

Supreme Court Will No Longer Use WhatsApp
వాట్సాప్​లో గ్రూప్​లకు సుప్రీం కోర్ట్​ గుడ్​బై
author img

By

Published : Mar 1, 2021, 7:42 AM IST

కోర్టు వ్యవహారాలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్సుల లింకులను ఇక నుంచి వాట్సాప్‌ గ్రూప్‌లలో పంపించకూడదని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ విషయానికి సంబంధించిన సర్క్యూలర్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వెల్లడించింది. కొవిడ్‌ కారణంగా దేశంలో వర్చువల్‌ కోర్టుల సంఖ్య పెరిగింది. సుప్రీంకోర్టు కేసుల సమాచారం కూడా వాట్సాప్‌లోనే పంచుకునేవారు. అయితే, ఇప్పటి నుంచి వాటిని రిజిస్టర్డ్‌ ఈ-మెయిల్‌, ధృవీకరించిన మొబైల్‌ నెంబర్‌ ద్వారానే పంపించాలని నిర్ణయించింది. తాజాగా వచ్చిన ఐటీ నిబంధనలు 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు రిజిస్ట్రీ పేర్కొంది.

కోర్టు విచారణలకు సంబంధించిన విషయాలను పంచుకునేందుకు, వాటి వీడియో కాన్ఫరెన్సుల సమాచారాన్ని పంపించేందుకు వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేయడాన్ని నిలిపివేస్తున్నట్టు సుప్రీం తెలిపింది. సామాజిక మాధ్యమాలు, ఓటీటీ ప్లాట్‌ఫాంలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియమావళికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టు వెల్లడించింది. మార్చి 1 నుంచి వీడియో కాన్ఫరెన్సుల సమాచారాన్ని రిజిస్ట్రీ సూచించిన మాధ్యమాల ద్వారానే పంపించాలని స్పష్టంచేసింది.

ఇదీ చదవండి:నేటి నుంచి వృద్ధులకు కరోనా టీకా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.