ETV Bharat / bharat

సుప్రీంకోర్టు విచారణలు లైవ్​లో చూడాలా? ఈ లింక్​పై క్లిక్ చేయండి!

Supreme Court live streaming : సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణను యూట్యూబ్​లో లైవ్​లో చూసేందుకు వీలు కల్పించింది సర్వోన్నత న్యాయస్థానం. త్వరలోనే ఇందుకోసం సొంత వేదికను అందుబాటులోకి తీసుకురానుంది.

Supreme Court live streaming
సుప్రీంకోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం
author img

By

Published : Sep 27, 2022, 10:30 AM IST

Updated : Sep 27, 2022, 10:37 AM IST

Supreme Court live hearing India : సుప్రీంకోర్టులో జరిగే కేసుల విచారణను ఇక సామాన్య పౌరులు సైతం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. రోజువారీ కార్యకలాపాలను మంగళవారం నుంచి లైవ్​ ద్వారా ప్రసారం చేస్తోంది సర్వోన్నత న్యాయస్థానం. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసుల్ని మాత్రమే యూట్యూబ్​లో చూసే వీలు కల్పించిన సుప్రీంకోర్టు.. త్వరలోనే ఇందుకోసం సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపింది.

కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యూయూ లలిత్​ నేతృత్వంలో గత మంగళవారం జరిగిన ఫుల్​ కోర్ట్ సమావేశంలో నిర్ణయించారు. లైవ్​ ఇచ్చేందుకు న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా.. సుప్రీంకోర్టు సిబ్బంది అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. https://main.sci.gov.in/display-board లేదా https://webcast.gov.in/scindia/ లో వేర్వేరు ధర్మాసనాల విచారణల ప్రత్యక్ష ప్రసారం లింకులు అందుబాటులో ఉంటాయి. ఈడబ్ల్యూఎస్​ కోటా; దిల్లీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రం, శివసేన వివాదం; ఆల్​ ఇండియా బార్ ఎగ్జామ్ చెల్లుబాటుపై మూడు వేర్వేరు ధర్మాసనాల విచారణల్ని ఇక్కడ చూడొచ్చు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అయితే.. అత్యున్నత న్యాయస్థానంలో జరిగే కార్యకలాపాల కాపీరైట్‌ హక్కులను.. యూట్యూబ్‌ వంటి ప్రైవేట్‌ వేదికలకు అప్పగించకూడదంటూ భాజపా మాజీ నేత కేఎన్‌ గోవిందాచార్య తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వెబ్‌కాస్ట్‌పై కాపీరైట్‌ హక్కులను యూట్యూబ్‌ స్పష్టంగా కోరినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రస్తుతం ప్రారంభ దశలోనే యూట్యూబ్​ ఉపయోగిస్తామని తెలిపింది. కాపీరైట్‌ సమస్యలపై దృష్టిసారిస్తామని పేర్కొంటూనే.. ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రత్యేకంగా సొంత వేదిక ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 17కు వాయిదా వేసింది.

2018లో మొదలు..
వాస్తవానికి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు 2018లోనే అనుమతి లభించింది. రాజ్యాంగం, జాతీయ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. అప్పట్లో రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వచ్చే కొన్ని కేసుల ప్రత్యక్ష ప్రసారానికి అంగీకారం తెలిపింది సర్వోన్నత న్యాయస్థానం. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టే ముఖ్యమైన కేసులను మొదట ప్రత్యక్షప్రసారం చేయవచ్చని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ గతంలో సూచించారు. జస్టిస్‌ ఎన్​వీ రమణ 2021 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. లైవ్​ విషయంలో న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయ సాధనకు కృషి చేశారు.

Supreme Court live streaming : సీజేఐగా జస్టిస్​ ఎన్​వీ రమణ పదవీ విరమణ రోజైన ఆగస్టు 26న కీలక ముందడుగు పడింది. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. జస్టిస్​ ఎన్​వీ రమణ, జస్టిస్​ యూయూ లలిత్​, జస్టిస్​ హిమా కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కార్యకలాపాల్ని లైవ్ ఇచ్చారు. రాజకీయ పార్టీల ఉచిత హామీలు, కర్ణాటకలో ఇనుప గనుల మైనింగ్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ వివాదాస్పద వ్యాఖ్యల కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించే అవకాశం కల్పించారు.

Last Updated : Sep 27, 2022, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.