ETV Bharat / bharat

'ఒకే దేశం-ఒకే రేషన్​ అమలు చేయాల్సిందే' - ఒకే దేశం ఒకే రేషన్ కార్డుపై సుప్రీంకోర్టు

ఒకే దేశం-ఒకే రేషన్​ పథకాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తప్పక అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పథకం ద్వారా వలస కార్మికులు లబ్ధి పొందుతారని పేర్కొంది.

supreme court to bengal govt, బంగాల్​ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
బంగాల్​కు సుప్రీంకోర్టు ఆదేశాలు
author img

By

Published : Jun 11, 2021, 5:02 PM IST

Updated : Jun 11, 2021, 9:59 PM IST

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే దేశం- ఒకే రేషన్ పథకాన్ని కచ్చితంగా అమలు చేయా​లని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పథకం ద్వారా ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న వలస కార్మికులు లబ్ధి పొందుతారని పేర్కొంది. అసంఘటిత రంగ కార్మికుల జాబితాకు సంబంధించి సాఫ్ట్​వేర్ రూపకల్పనలో ఆలస్యం జరగడంపై జస్టిస్​ అశోక్​ భూషణ్, జస్టిస్​ ఎంఆర్​ షా ఆధ్వర్యంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా.. రేషన్​ కార్డు లేని వలస కూలీలు ఏ రకంగా లబ్ధిపొందుతారని ఆందోళన వ్యక్తం చేసింది. వలస కూలీల సమస్యలపై సుమోటో కేసు విచారణ సందర్భంగా శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా దిల్లీ, బంగాల్​, ఛత్తీస్​గఢ్​, అసోంలు ఈ పథకాన్ని అమలు చేయటం లేదని ధర్మాసనానికి తెలిపారు కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా. దిల్లీ తరఫు న్యాయవాది ఈ వాదనలు తొసిపుచ్చారు. దేశ రాజధానిలో అమలు చేస్తున్నట్లు చెప్పారు.

ఒకే దేశం-ఒకే రేషన్ అమలుకు ఆధార్​ నెంబర్లకు సంబంధించిన సమస్య ఉందన్న బంగాల్​ తరపు కౌన్సిల్​ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇది వలస కూలీల లబ్ధికోసం ఏర్పాటు చేసిన పథకమని.. దీనిని తప్పక అమలు చేయాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి : ''ఒకే దేశం-ఒకే ధర' టీకాలకు వర్తించదా?'

Last Updated : Jun 11, 2021, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.