Supreme Court adjourns hearing on Chandrababu in skill case: స్కిల్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీకి మరోసారి చుక్కెదురైంది. చంద్రబాబు బెయిల్ రద్దుపై వెంటనే విచారణ చేపట్టేందుకు నిరాకరించిన సుప్రీం.. క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే విచారణ చేస్తామని స్పష్టం చేసింది. అప్పటి వరకు చంద్రబాబును రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలన్న సీఐడీ వాదనను సైతం సుప్రీం తోసిపుచ్చింది. అయితే స్కిల్ కేసుకు సంబంధించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడొద్దని.. తదుపరి విచారణ పూర్తయ్య వరకు కేసు ప్రస్తావన తీసుకురావొద్దని చంద్రబాబుకు సూచించింది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని తెలిపింది. ఇరువురు సంయమనం పాటించాలని ఆదేశిస్తూ....డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు సుప్రీం తాఖీదులు జారీ చేసింది.
చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సీఐడీ పిటిషన్ - విచారణ డిసెంబర్ 8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Published : Nov 28, 2023, 2:57 PM IST
|Updated : Nov 28, 2023, 4:57 PM IST
14:54 November 28
ర్యాలీలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చన్న సుప్రీంకోర్టు