Students drugs fight: చదువుకుని రోగుల బాగోగులు చూసుకోవాల్సిన విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసయ్యారు. వారు ప్రయాణిస్తున్న బైక్‌లో పెట్రోల్ అయిపోవడంపై నడిరోడ్డుపై గొడవ పడ్డారు. శాంతింపజేసేందుకు ప్రయత్నించిన పోలీసులు, స్థానికులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన కర్ణాటక ఉడుపి జిల్లాలో జరిగింది.
ఏమైందంటే..?
ఓ అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు కలిసి ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్నారు. పాడుబిద్రి పట్టణంలోకి రాగానే బైక్ ఒక్కసారిగా ఆగిపోయింది. పెట్రోల్ అయిపోయిన కారణంగా బైక్ ఆగిపోయిందని గ్రహించిన యువత ఒకరిపై మరొకరు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పిడిగిద్దులు కురిపించుకున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగారు పోలీసులు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతోనూ యువత వాగ్వాదానికి దిగారు. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి నిరాకరించారు. చేసేదేమీ లేక స్థానికుల సహకారంతో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. విద్యార్థులు తమిళనాడుకు చెందినవారుగా గుర్తించారు. ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నట్లు చెప్పారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: ఉమ్మువేసి రోటీలు తయారీ- యువకుడి అరెస్ట్
ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్లు వాడండి కాదంటే.. నా చావుకు అనుమతించండి