ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో లాక్​డౌన్​.. ఆ రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ!

కొవిడ్​ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు చర్యలను ముమ్మరం చేశాయి. పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధించగా, మరికొన్ని లాక్​డౌన్​ను ప్రకటించాయి. వైరస్​ను కట్టడి చేసేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్టు సంబంధిత రాష్ట్రాలు స్పష్టం చేశాయి. దిల్లీ, పంజాబ్​, చండీగఢ్​లలో అధికారులు రాత్రి కర్ఫ్యూ విధించగా, ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​ జిల్లాలో లాక్​డౌన్​ అమలు కానుంది.

రాత్రి కర్ఫ్యూ, states impose night curfew
రాత్రి కర్ఫ్యూ
author img

By

Published : Apr 7, 2021, 8:02 PM IST

కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు ఆంక్షలను కట్టుదిట్టం చేశాయి, పలు చోట్ల లాక్​డౌన్​ కూడా అమలు కానుంది.

ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​ జిల్లాలో 10 రోజుల పాటు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈనెల 9న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై 19వ తేదీ ఉదయం 6 వరకు లాక్​డౌన్​ ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. వైరస్​ విజృంభిస్తుండటం వల్ల ప్రజలను కట్టడి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

లాక్​డౌన్​ సమయంలో మందుల దుకాణాలు మినహా మిగతా అన్ని షాపులు, వాణిజ్య కేంద్రాలు మూసివేయలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు కూడా మూతపడతాయని వెల్లడించింది. టెలికాం​, రైల్వే, విమానాశ్రయాలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నామని పేర్కొంది. బహిరంగ సమావేశాలు, మత, సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధించింది.

దిల్లీలో రాత్రి కర్ఫ్యూ

వైరస్​ వ్యాప్తి దృష్ట్యా దిల్లీలో రాత్రి కర్ఫ్యూను అమలు చేసింది కేజ్రీవాల్ సర్కార్. మంగళవారం నుంచి అమలులోకి వచ్చిన ఈ కర్ఫ్యూ ఈనెల 30 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల మధ్య ఈ ఆంక్షలు ఉంటాయని పేర్కొంది.

రాత్రి కర్ఫ్యూ, states impose night curfew
దిల్లీలో రాత్రి కర్ఫ్యూ
రాత్రి కర్ఫ్యూ, states impose night curfew
దిల్లీలో రాత్రి కర్ఫ్యూ

కర్ఫ్యూ వేళల్లో.. వ్యాక్సిన్ కోసం పంపిణీ కేంద్రాల వద్దే రిజిస్టర్​ కావాలనుకునేవారు ముందుగా ఈ-పాస్​ తీసుకోవాలని స్పష్టం చేసింది దిల్లీ ప్రభుత్వం. ఈ-పాస్ ఉంటేనే బయటకు వెళ్లేందుకు వారికి అనుమతి లభిస్తుందని తెలిపింది. కొవిన్​ యాప్​ ద్వారా రిజిస్టర్​ అయిన వారు సంబంధిత మెసేజ్​ను చూపిస్తే సరిపోతుందని పేర్కొంది.

అక్కడ సెక్షన్​ 144..

కరోనా వ్యాప్తి దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో బుధవారం నుంచి 144 సెక్షన్​ను అమలులోకి తెచ్చింది. అపార్టుమెంట్లలోని స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌లు, పార్టీ హాల్స్‌పై నిషేధం విధించింది.

పంజాబ్‌లోనూ..

పంజాబ్​లో బయటపడుతున్న పాజిటివ్‌ కేసుల్లో 80శాతం బ్రిటన్ రకానివే ఉండడం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని బుధవారం ప్రకటించింది. ఏప్రిల్‌ 30 వరకు కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతాయని.. ఈ సమయంలో రాజకీయ సభలు, సమావేశాలపై నిషేధం విధించడం సహా మాల్స్‌, మార్కెట్ల వంటి రద్దీ ప్రదేశాల్లో జనసంచారంపై ఆంక్షలు ఉంటాయని పేర్కొంది.

చండీగఢ్​లో కూడా బుధవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు కానుంది. ఆస్పత్రులు, మెడికల్​ షాపులు, ఏటీఎంలకు మినహాయింపు ఇవ్వనున్నారు. రాత్రి 10.30 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అమలు ఉంటుంది. అయితే ఆంక్షలు ఎన్ని రోజుల వరకు కొనసాగుతాయనే విషయంపై స్పష్టత లేదు.

ఇదీ చదవండి : 'మూడు రోజుల్లో కరోనా టీకాలు ఖాళీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.