నిరుద్యోగులకు శుభవార్త. ఎస్ఎస్సీ(SSC)లో 25 వేల జీడీ కానిస్టేబుల్(GD Constable) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా 25,271 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎస్ఎస్సీ. ఇందులో 10 శాతం ఉద్యోగాలు ఎక్స్ సర్వీస్‌మెన్(ఈఎస్ఎమ్) కోటా కింద ఉన్నట్లు తెలిపింది.
పరీక్ష:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష
ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్
దేహదారుడ్య పరీక్ష
వైద్య పరీక్షలు
డాక్యుమెంట్ వెరిఫికేషన్
అర్హత:
వయస్సు: 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఉన్నవారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హత: కనీసం పదవతరగతి పాసై ఉండాలి.
పరీక్ష విధానం:
తొలుత కంప్యూటర్ ఆధారిత పరీక్ష(టైర్-1) నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టైప్‌లో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. తప్పుడు సమాధానాలకు 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రశ్నలు.. ఆంగ్లం, హిందీ భాషల్లో ఉంటాయి.
పార్ట్ | సబ్జెక్ట్ | ప్రశ్నల సంఖ్య | మార్కులు | సమయం |
పార్ట్- ఏ | జనరల్ ఇంటలిజన్స్ అండ్ రీజనింగ్ | 25 | 25 | 90 నిమిషాలు |
పార్ట్ - బీ | జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ | 25 | 25 | |
పార్ట్- సీ | ఎలిమెంటరీ మాథ్స్ | 25 | 25 | |
పార్ట్- డీ | ఇంగ్లీష్/ హిందీ | 25 | 25 |
ఫీజు:
అప్లికేషన్‌కు 100 రూపాయాలు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్సీ కేటగిరీ వారు, ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా వారికి ఫీజు మినహాయింపు ఉంది.
జీతం:
ఉద్యోగానికి ఎంపికైన వారికి గ్రేడ్ 3 లెవల్ కింద రూ. 21,700-రూ. 69,100 వరకు జీతం ఉంటుంది.
అప్లికేషన్ కోసం ssc.nic.in వెబ్‌సైట్‌ను చూడాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి:7 వేల SSC ఉద్యోగాలకు పరీక్ష ఎప్పుడంటే?