ETV Bharat / bharat

40 మంది భారత జాలర్ల విడుదల - శ్రీలంకలో అరెస్టైన భారత జాలర్లు

శ్రీలంకలో అరెస్టైన 54 మంది భారత జాలర్లలో 40 మంది విడుదలయ్యారు. అలాగే ఆ దేశ నేవీ సీజ్​ చేసిన ఐదు పడవల్లో నాలుగింటిని విడుదల చేసిందని తమిళనాడు అధికారులు పేర్కొన్నారు.

Sri Lanka releases 40 Indian fishermen:TN officials
శ్రీలంక అరెస్టు చేసిన జాలర్లలో 40మంది విడుదల
author img

By

Published : Mar 26, 2021, 9:09 PM IST

Updated : Mar 26, 2021, 10:13 PM IST

శ్రీలంక అధికారులు అరెస్టు చేసిన 54 మంది భారత మత్స్యకారులలో 40 మంది శుక్రవారం విడుదలయ్యారు. వీరితో పాటు సీజ్​ అయిన ఐదు ఓడల్లో నాలుగింటిని విడుదల చేశారని తమిళనాడు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. పుదుచ్చేరిలోని కరైకల్​కి చెందిన 14 మంది జాలర్లు రేపు విడుదలయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

విడుదలైన మత్స్యకారులంతా తమిళనాడులోని రామేశ్వరం, నాగపట్నం, కరైకల్​కి చెందిన వారు. శ్రీలంక అధీనంలోని సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేటకు వెళ్లారనే కారణంతో అక్కడి తీరప్రాంత అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఎన్నికల బహిష్కరణ లేదు..

తమిళ జాలర్లను పదేపదే శ్రీలంక నేవీ అరెస్టు చేస్తుండటంపై మత్స్యకారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అరెస్టైన వారిని వెంటనే విడుదల చేయాలని భారత ప్రభుత్వంతో పాటు, తమిళనాడు సర్కారుకు విజ్ఞప్తి చేశాయి. వారు విడుదలవ్వకపోతే ఏప్రిల్ 6న జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించాయి. అంతేగాక.. చేపల వేట కొనసాగించేది లేదని పేర్కొన్నాయి. అయితే వీరంతా విడుదలైన నేపథ్యంలో ఆ ప్రకటనలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించాయి.

ఇదీ చదవండి: శ్రీలంక అదుపులో 54 మంది భారత జాలర్లు

Last Updated : Mar 26, 2021, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.