Split In JDS 2023 : బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో కర్ణాటకకు చెందిన జేడీఎస్ ఇటీవలే చేరగా.. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ C.M ఇబ్రహీం కీలక ప్రకటన చేశారు. ఎన్డీఏలో జేడీఎస్ చేరదంటూ.. పార్టీ అధినేత దేవెగౌడ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడారు. పార్టీలో చీలిక ఏర్పడ్డట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారు. తమదే అసలైన 'సెక్యులర్' వర్గమని ప్రకటించుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని ఆ పార్టీ అధినేత దేవెగౌడకు విజ్ఞప్తి చేశారు. సోమవారం.. ఆయన తమ పార్టీకి చెందిన పలువురు నేతలతో సమావేశమయ్యాక మీడియాతో మాట్లాడారు.
"బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరబోమనేది మా తొలి నిర్ణయం. పొత్తుకు అంగీకరించవద్దని అధినేత దేవెగౌడకు విజ్ఞప్తి చేయడం రెండో నిర్ణయం. బీజేపీ- జేడీఎస్ పొత్తు తర్వాత కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో పలువురు జేడీఎస్ నేతలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో నేటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని దేవెగౌడకు తెలియజేస్తాను"
-- C.M ఇబ్రహీం, జేడీఎస్ కర్ణాటక చీఫ్
'వాళ్లు వెళ్తే వెళ్లనివ్వండి'
JDS Party Split 2023 : జేడీఎస్ అధినేత దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి.. తన నిర్ణయంతో ఏకీభవించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటన్న ప్రశ్నపై ఇబ్రహీం బదులిచ్చారు. "నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. రాష్ట్రంలో పార్టీకి సంబంధించి నిర్ణయాలు నేను తీసుకోవాలి. బీజేపీతో వెళ్లబోమని ఇప్పటికే తేల్చి చెప్పేశాం. ఇంతకంటే ఇంకేముంది?" అని సమాధానమిచ్చారు. ఒకవేళ దేవెగౌడ, కుమారస్వామి బీజేపీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లయితే వెళ్లనివ్వండంటూ వ్యాఖ్యలు చేశారు.
-
VIDEO | "The final decision is that there is no alliance with the NDA. We are the original JD(S) and we don't accept it," says Karnataka JD(S) president CM Ibrahim on JD(S) joining NDA. pic.twitter.com/82E5Pit27R
— Press Trust of India (@PTI_News) October 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "The final decision is that there is no alliance with the NDA. We are the original JD(S) and we don't accept it," says Karnataka JD(S) president CM Ibrahim on JD(S) joining NDA. pic.twitter.com/82E5Pit27R
— Press Trust of India (@PTI_News) October 16, 2023VIDEO | "The final decision is that there is no alliance with the NDA. We are the original JD(S) and we don't accept it," says Karnataka JD(S) president CM Ibrahim on JD(S) joining NDA. pic.twitter.com/82E5Pit27R
— Press Trust of India (@PTI_News) October 16, 2023
'సమయం వస్తే అన్నీ చెబుతాను'
JDS Party Latest News : "బీజేపీతో పొత్తుకు వద్దని దేవెగౌడ, కుమారస్వామిని కోరుతున్నాం. అప్పటికి వాళ్లు బీజేపీతోనే వెళ్తే మేమేం చేయలేం. జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎవరు, ఎలా, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. సమయం వచ్చినప్పుడు అన్నీ తెలియజేస్తాను. చాలా మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు. వారు పేర్లు చెప్పను. వారందరితో సమావేశం కూడా నిర్వహిస్తాను" అని ఇబ్రహీం తెలిపారు..
అమిత్ షా, నడ్డాతో సమావేశమయ్యాక..
JDS BJP Alliance 2024 : సెప్టెంబర్ 22వ తేదీన దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన తర్వాత జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఎన్డీఏలో చేరుతున్నట్టు ప్రకటించారు.
'కింగ్' కాలేదు.. 'ప్రిన్స్' గెలవలేదు.. దేవెగౌడ ఫ్యామిలీకి తీవ్ర నిరాశ
బీజేపీతో జట్టుకట్టేందుకు జేడీఎస్ తహతహ! విపక్షాలపై విమర్శలు.. '2024' కోసమే!