ETV Bharat / bharat

బైక్​ను ఢీకొని 4 కి.మీలు ఈడ్చుకెళ్లిన కారు.. గ్రిల్​లో ఇరుక్కుని ఇద్దరు యువకులు.. - హరియాణా కారు యాక్సిడెంట్ న్యూస్

బైక్​పై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వస్తున్న కారు ఢీకొని 4 కిలోమీటర్లు మేర ఈడ్చుకుని వెళ్లింది. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Speeding car hits bike drags youths for 4km
బైక్​ను ఢీకొని 4 కిమీ ఈడ్చుకెళ్లిన కారు
author img

By

Published : Feb 3, 2023, 10:15 AM IST

Updated : Feb 3, 2023, 11:34 AM IST

దిల్లీకి చెందిన అంజలి అనే యువతిని కారు ఢీకొని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన తరహా మరో ఘటన హరియాణాలో వెలుగుచూసింది. బైక్​పై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వస్తున్న కారు ఢీకొని నాలుగు కిలోమీటర్లు మేర ఈడ్చుకుని వెళ్లింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు యువకులు త్రుటిలో తప్పించుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల సమాచారం ప్రకారం..
రోజువారీ పనులు ముగించుకుని బైక్​ పైన ఇంటికి వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటన బుధవారం రాత్రి గురుగ్రామ్​ సమీపంలో 62వ సెక్టార్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో యువకులు కింద పడిపోయి కారు గ్రిల్​లో ఇరుక్కుపోయారు. అయినప్పటికీ నిందితుడు కారు ఆపకుండా నాలుగు కిలోమీటర్లు ఈడ్చుకుని వెళ్లాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము అరుస్తూ ఉన్నా మద్యం మత్తులో ఉన్న నిందితుడు మాత్రం వినిపించుకోకుండా 4 కిలోమీటర్లు మేర ఈడ్చుకుని వెళ్లాడని యువకులు ఆరోపించారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు యువకులకు పెద్దగా గాయాలవ్వలేదు.

Last Updated : Feb 3, 2023, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.