ETV Bharat / bharat

షారుక్​తో పీకే భేటీ.. పొలిటికల్​ ఎంట్రీ ఖాయమా? - షారుక్​తో ప్రశాంత్​ కిశోర్​ భేటీ

బాలీవుడ్​ సూపర్​స్టార్​ షారుక్​తో భేటీ అయ్యారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​. ఈ నేపథ్యంలో షారుక్​ పొలిటికల్​ ఎంట్రీపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

Prashant Kishor meets Shah Rukh
షారుక్​తో ప్రశాంత్​ కిశోర్​ భేటీ
author img

By

Published : Jun 13, 2021, 9:17 AM IST

ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకున్న అనంతరం ప్రశాంత్​ కిశోర్(Prashant kishor) దేశవ్యాప్త పర్యటనలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇటీవలే ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ను కలిసిన ప్రశాంత్​.. తాజాగా బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్​(Shahrukh khan)​తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వీరి మధ్య సమావేశం ఎందుకు జరిగిందనే విషయంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. షారుక్​ పొలికటికల్​ ఎంట్రీ ఇస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంటే.. ఆయన నిర్మాణ సంస్థ 'రెడ్​ చిల్లీస్'​ బ్యానర్​లో ప్రశాంత్​ బయోపిక్​ రానుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

అయితే బయోపిక్​ రూమర్లను రెడ్​ చిల్లీస్ ప్రతినిధి తోసిపుచ్చారు. బంగాల్​ సీఎం మమతా బెనర్జీ.. షారుక్​కు ప్రశాంత్​ను పరిచయం చేసినప్పటి నుంచి వారిద్దరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారని తెలుస్తోంది. ఇక షారుక్​ రాజకీయ రంగ ప్రవేశం ఊహాగానాలు కూడా నిరాధారమని సమాచారం.

తన పనిలో సహాయపడిన వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకే ప్రశాంత్ ఈ పర్యటనలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఇదీ చూడండి: ప్రశాంత్​ కిశోర్​ నోట భాజపా అనుకూల మాట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.