ETV Bharat / bharat

డ్రగ్స్​ ఇచ్చి టిక్​టాక్​ స్టార్ హత్య, సీసీటీవీ ఫుటేజ్​తో తేల్చిన పోలీసులు - సోనాలీ ఫోగాట్​

టిక్​టాక్​ స్టార్​ సొనాలీ ఫోగాట్​ హత్యకేసులో మరో ట్విస్ట్​. ఆమె హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసుల చేతిలోకి మరో ఆధారం లభించింది. అదేందంటే.

sonali poghat
sonali poghat
author img

By

Published : Aug 26, 2022, 7:22 PM IST

గోవా పర్యటనలో రెండు రోజుల కిందట ఆకస్మిక మరణానికి గురైన టిక్‌టాక్‌ నటి, భాజపా నాయకురాలు సోనాలీ ఫోగాట్‌(42) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి రెస్టారెంట్‌లో పార్టీలో పాల్గొన్న సమయంలో సహాయకులు ఆమెకు బలవంతంగా ఓ రసాయనాన్ని ఎక్కించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. తర్వాత ఆమెను టాయిలెట్‌లోకి తీసుకెళ్లారని, అక్కడ నిందితులు, ఫోగాట్ రెండు గంటల పాటు ఉన్నారని గోవా ఐజీపీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ శుక్రవారం వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్‌, నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా ఈ విషయం వెల్లడించారు.

'సీసీటీవీ ఫుటేజ్‌ ప్రకారం.. సోనాలీ సహాయకులు సుధీర్‌ సాగవాన్‌, సుఖ్వీందర్ వాసి ఆమెతో కలిసి క్లబ్‌లో పార్టీ చేసుకున్నారు. వారిలో ఒకరు ఆమెతో బలవంతగా ఓ పదార్థాన్ని తాగించారు. దీని గురించి నిందితుల్ని ఆరాతీయగా.. ఉద్దేశపూర్వకంగానే ఆమెతో ప్రమాదకరమైన రసాయనాన్ని తాగించామని అంగీకరించారు. తర్వాత ఆమె స్పృహ కోల్పోయారు. ఆ సమయంలో ఆమెను టాయిలెట్‌లోకి తీసుకెళ్లారు. రెండు గంటల పాటు అక్కడ ఏం జరిగిందో మాత్రం వారు నోరు విప్పలేదు. ఆ ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశాం. త్వరలో వారిని కోర్టులో ప్రవేశపెట్టనున్నాం. అయితే ఆమె వారిచ్చిన డ్రగ్స్‌ కారణంగానే మరణించినట్లు తెలుస్తోంది' అని పోలీసు అధికారి తెలిపారు.

గోవా పర్యటనలో ఉన్న ఆమె మొదట గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం సోనాలీ ఫోగాట్‌ శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు తేలింది. దాంతో ఆమెతో పాటు ఉన్న ఆ సహాయకులపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సోనాలీ మరణంపై అనుమానం వ్యక్తంచేస్తూ ఆమె సోదరుడు రింకూ ఢాకా బుధవారం అంజునా పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆమె మరణం వెనక ఎమ్మెల్యే ఉన్నారా..?
సోనాలీ అనుమానాస్పద మృతి వెనక హరియాణాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. దానిపై ఆమె సోదరుడు రింకూ స్పందించారు. 'అలాంటిది ఏమీ లేదు' అని వాటిని తోసిపుచ్చారు. అయితే ఆమెకు ఆహారంలో డ్రగ్స్ కలిపిచ్చారని, తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె సోదరుడు ఫిర్యాదులో ఆరోపించారు. 'అసలు ఆమె గోవా వెళ్లే ప్రణాళిక ఏమీ లేదు. ఆమె వెనక కుట్ర చేసి, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ సినిమా షూటింగ్ ఏమీ లేదు. మామూలుగా షూటింగ్ ఆగస్టు 24న జరగాల్సింది. కానీ హోటల్ గదులు మాత్రం ఆగస్టు 21-22కే బుక్ చేశారు' అంటూ రింకూ వెల్లడించారు.

మాజీ టిక్‌టాక్‌ స్టార్‌గా, 'బిగ్‌బాస్‌' టీవీ రియాలిటీ షో ద్వారా ప్రాచుర్యం పొందారు సోనాలీ ఫోగాట్‌. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణాలోని ఆదంపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీచేశారు. అయితే ఆ ఎన్నికలో ఆమె ఓడిపోయారు. ఆమె భర్త కొన్నేళ్ల కిందటే మృతి చెందారు. వారికి ఒక కుమార్తె ఉంది.

ఇదీ చదవండి:

అనసూయ ఫైనల్ వార్నింగ్, ఆ కామెంట్స్​ చేసిన వారందరిపై కేసులు

ఆ కామెంట్స్ చేస్తే ఎవరినీ వదలనని అనసూయ వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.