ETV Bharat / bharat

మోదీకి సోనియా లేఖ- టీకా విధానంపై అసహనం

author img

By

Published : Apr 22, 2021, 1:03 PM IST

Updated : Apr 22, 2021, 1:22 PM IST

కేంద్రం టీకా విధానంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శలు చేశారు. ఒకే టీకాకు వేర్వేరు ధరలు ఎందుకు ఉంటున్నాయని ప్రశ్నించారు. 18 ఏళ్లు పైబడిన వారికి టీకా ఎందుకు ఉచితంగా ఇవ్వడం లేదని అడిగారు.

Sonia Gandhi writes to PM Modi on vaccination
మోదీకి సోనియా లేఖ- టీకా విధానంపై అసహనం

కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ పాలసీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 18 ఏళ్లుపైబడిన వ్యక్తులకు టీకా ఉచితంగా ఇవ్వకపోవడాన్ని సోనియా తప్పుబట్టారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా నియంత్రణపై గతేడాది పాఠాలు నేర్చుకున్నప్పటికీ.. ప్రభుత్వం వివక్షపూరిత విధానాన్నే అవలంబించడం బాధాకరమని అన్నారు.

  • Congress chief writes to PM over new #COVID19 vaccination policy for inoculation of people b/w 18-45 yrs of age

    Letter reads "Policy implies GoI has abdicated responsibility to provide free vaccination for these citizens...Urge you to intervene & reverse ill-considered decision" pic.twitter.com/5jMypGgTmh

    — ANI (@ANI) April 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"టీకా పాలసీని చూస్తుంటే 18-45 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలన్న బాధ్యతను ప్రభుత్వం వదిలించుకున్నట్లు తెలుస్తోంది. తప్పుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇందులో ప్రధాని జోక్యం చేసుకోవాలి. అన్ని ప్రాంతాల్లో ఒకే ధరకు టీకా అందుబాటులో ఉండేలా చూడాలి. ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు.. ఇలా లాభాలు సంపాదించడానికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది?"

-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి

ఈ వ్యాక్సిన్ విధానం వల్ల.. కేంద్ర ప్రభుత్వానికి రూ. 150కే అందిస్తున్న టీకాను సీరం సంస్థ.. రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600కు విక్రయించాలని నిర్ణయించిందని సోనియా పేర్కొన్నారు. దీని వల్ల ప్రజలు టీకా కోసం ఎక్కువ ధర వెచ్చించే పరిస్థితి తలెత్తుతుందని, రాష్ట్రాల నిధులు కూడా వీటికే ఖర్చయిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకే సంస్థ ఉత్పత్తి చేస్తున్న టీకాకు వేర్వేరు ధరలు ఎందుకు ఉంటున్నాయని సోనియా ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ టీకా అందించడమే ప్రస్తుతం దేశ లక్ష్యమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి- 'మోదీజీ ప్రసంగాలు కాదు.. పరిష్కారం చెప్పండి'

Last Updated : Apr 22, 2021, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.