ETV Bharat / bharat

వైరస్ కట్టడిపై సోనియా గాంధీ సమీక్ష

కొవిడ్​ కట్టడికి చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించేందుకు కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్​ నిల్వలు, వెంటిలేటర్లు తదితర వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు.

author img

By

Published : Apr 10, 2021, 12:28 PM IST

Updated : Apr 10, 2021, 2:33 PM IST

sonia gandhi to hold meeting with cms of congress ruled states
కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోనియా సమీక్ష

కరోనా రెండో దశ వ్యాప్తిని కట్టడి చేసే చర్యలపై సమీక్షించేందుకు కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశమయ్యారు. కొవిడ్​ కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు, ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ నిల్వలు, ఇతర మందులు, వైద్య పరికరాల గురించి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా చర్చించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ, రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​, పంజాబ్​ సీఎం అమరిందర్​ సింగ్​, ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్​ బఘేల్​ తదితరులు పాల్గొన్నారు.

పంజాబ్​లో వ్యాక్సిన్​ మరో ఐదు రోజులకు సరిపడ మాత్రమే ఉందని అమరిందర్​ సింగ్​ తెలిపారు. మరో మూడు రోజులకు సరిపోయే టీకాలు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయని భఘేల్​ వెల్లడించారు.

వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు టెస్టింగ్​-ట్రాకింగ్​​-వ్యాక్సినేషన్​ ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాలని సోనియా గాంధీ కోరారు.

కేంద్రం పారదర్శకంగా వ్యవహరించాలి. కరోనా కేసులు, మరణాల సంఖ్యను రాష్ట్రాలు తప్పుగా చూపించొద్దు. భారత్​లో వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగంగా చేపట్టాలి. మన అవసరాల తర్వాతే.. ఇతర దేశాలకు ఎగుమతి చెయ్యాలి. కొవిడ్​ నియమాలు ఆచరిస్తూ అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాష్ట్రాలకు కేంద్రం సహకరించటం సమాఖ్య స్ఫూర్తికి ఇచ్చే గౌరవం. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ కొవిడ్​ను జయించాలి."

-సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు

'వ్యాక్సిన్​ ఎగుమతితో కొరత..'

కరోనా పరిస్థితులను ఎదుర్కోవటంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని కేంద్రంపై సోనియా గాంధీ ధ్వజమెత్తారు. వ్యాక్సిన్​ను ఇతర దేశాలకు​ ఎగుమతి చేసి దేశంలో టీకా కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు. వైరస్​ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ప్రజల క్షేమం కోసం పాటుపడేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. మరోసారి లాక్​డౌన్​ పరిస్థితులు ఎదురైతే రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: బంగాల్​ ఎన్నికలు​: జోరుగా పోలింగ్​- ఓటర్ల బారులు

Last Updated : Apr 10, 2021, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.