ETV Bharat / bharat

సోనియా గాంధీ పీఏపై రేప్ కేసు, పోలీసులపై నమ్మకం పోయిందన్న బాధితురాలు - సోనియా పీఏ రేప్

సోనియా వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ ప్రజల సాయం కోరుతూ తాజాగా వీడియో విడుదల చేశారు. పోలీసులపై తనకు నమ్మకం పోయిందని అందులో పేర్కొన్నారు. కేసు వెనక్కి తీసుకోవాలని తనను కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు.

sonia-gandhi-pa-madhavan-rape-cas
sonia-gandhi-pa-madhavan-rape-cas
author img

By

Published : Aug 30, 2022, 1:59 PM IST

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి(పీఏ) పీపీ మాధవన్​పై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ.. తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. పోలీసులు తనకు ఎలాంటి సహాయం చేయడం లేదని ఆమె ఆరోపించారు. వారిపై తనకు నమ్మకం పోయిందని, అందుకే ప్రజల మద్దతు కోరుతున్నట్లు ఆవేదనతో చెప్పారు. వివాహం చేసుకుంటానని నమ్మించి మాధవన్ తనపై అత్యాచారం చేశాడని వీడియోలో పేర్కొన్నారు.

"మానసికంగా కుంగిపోయి, తీవ్ర మనోవేదనతో ఈ వీడియో తీస్తున్నా. వివాహం చేసుకుంటానని చెప్పి మాధవన్ నన్ను రేప్ చేశాడు. దీనిపై ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశా. పోలీసులు అతడిని(నిందితుడిని) కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు నన్ను ఎలాంటి ఆధారాలు అడగలేదు. దర్యాప్తు అధికారిని సైతం మార్చేశారు. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఛార్జిషీట్ సమర్పించే సమయంలోనూ నన్ను సంప్రదించలేదు. చాలా మంది నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఓ లాయర్ సైతం బెదిరించాడు."
-ఆరోపణలు చేసిన మహిళ

మహిళ ఫిర్యాదు మేరకు సోనియా వ్యక్తిగత కార్యదర్శి మాధవన్​పై 2022 జనవరి 21న కేసు నమోదైంది. దిల్లీలోని ఉత్తమ్ నగర్ పోలీసులు సెక్షన్ 376, 506 ప్రకారం కేసు నమోదు చేసుకున్నారు. 2018లో తన భర్త కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, కార్యక్రమాలకు హోర్డింగ్​లు పెట్టేవాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడని చెప్పారు. తన భర్త 2020 ఫిబ్రవరిలో చనిపోయాడని.. తర్వాత తన ఆర్థిక పరిస్థితి దిగజారిందని వివరించారు.

'నా భర్త మరణం తర్వాత సహాయం కోసం కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లా. సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిని కలిశా. ఆ తర్వాత మాధవన్ నాతో చాలా సార్లు మాట్లాడాడు. నా ఆర్థిక పరిస్థితి గురించి నేను అతడికి వివరించాను. నాకు జాబ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉన్నాం. 2022 జనవరి 21న జాబ్ ఇంటర్వ్యూ గురించి నాకు మెసేజ్ పంపించాడు. సురేంద్ర నగర్​లోని ఓ ఇంటికి వెళ్లాలని సూచించాడు' అని తన ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కొన్నారు. అక్కడే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.