ETV Bharat / bharat

కన్నతల్లిపై అత్యాచారం.. ఆపై గొంతు నులిమి.. - Haveri rape news

మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన కర్ణాటకలో జరిగింది. కన్న తల్లినే హత్యాచారం చేశాడు ఓ కర్కశ కొడుకు. ఈ నెల 12 జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Son raped and killed his Mother in Haveri
కన్నతల్లిపై అత్యాచారం.. ఆపై గొంతు నులిమి..కన్నతల్లిపై అత్యాచారం.. ఆపై గొంతు నులిమి..
author img

By

Published : Nov 15, 2020, 12:33 PM IST

Updated : Nov 15, 2020, 2:46 PM IST

అమానుషంగా ప్రవరిస్తున్న కొందరు వావివరసలు లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మృగాల కన్నా హీనంగా తయారవుతున్నారు. తాజాగా కర్ణాటక హవేరి జిల్లాలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. మానవ మృగంలా మారిన ఓ కొడుకు.. కన్న తల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే దారుణమనుకుంటే.. తల్లి అని కూడా ఆలోచించకుండా గొంతునులిమి చంపేశాడు ఆ కీచకడు.

శివప్ప లామణి అనే వ్యక్తి ఈ నెల 12న తల్లిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడు. పోలీసుల చొరవతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ దారుణం.

మృతురాలి భర్త ఆరేళ్ల క్రితం మరణించగా.. కొడుకు శివప్పతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన శివప్ప... తల్లిపై కోపంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత రోజు శవాన్ని గుర్తించిన పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఇద్దరు యువతులపై ఆరుగురి అత్యాచారం

Last Updated : Nov 15, 2020, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.