ETV Bharat / bharat

తల్లి తల నరికి తీసుకెళ్లిన కొడుకు- ఆస్తి కోసం దారుణం! - తల్లి తల నరికి తీసుకెళ్లిన కొడుకు

Son Murdered Mother By Slitting Her Throat : ఉత్తర్​ప్రదేశ్​ సీతాపుర్​లో దారుణ ఘటన జరిగింది. తల్లిని హత్య చేసి ఆమె తలను తీసుకుని పారిపోయాడు ఓ కొడుకు.

Son Murdered Mother By Slitting Her Throat

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 12:52 PM IST

Updated : Dec 10, 2023, 2:28 PM IST

Son Murdered Mother By Slitting Her Throat : ఆస్తి వివాదంతో తల్లిని దారుణంగా హత్య చేశాడో కుమారుడు. అనంతరం ఆమె తలను నరికి తీసుకుని పరారయ్యాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని సీతాపుర్​లో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని నాలుగు గంటల్లోనే పట్టుకున్నారు. అతడి నుంచి మృతురాలి తలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ జరిగింది
మిర్జాపుర్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన కమలా దేవికి (65) చాలా ఏళ్ల క్రితం హరిద్వారితో వివాహం జరగగా దినేశ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, కొన్నేళ్ల కింద హరిద్వారి మరణించాడు. దీంతో అతడి ఆస్తి భార్య కమలా దేవి, కుమారుడు దినేశ్​ పేరిట మారిపోయింది. హరిద్వారి మరణించిన తర్వాత కమలా దేవి మరో వివాహం చేసుకుని వెళ్లిపోయింది. దీంతో తన తండ్రి ద్వారా వచ్చిన ఎకరన్నర ఆస్తిని తిరిగి ఇవ్వాలని కోరాడు. దీనికి కమలా దేవి అంగీకరించకపోవడం వల్ల ఇద్దరి మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయాలని భావించాడు నిందితుడు దినేశ్​. శనివారం ఉదయం మేకలను మేపేందుకు అడవికి వెళ్లిన కమలా దేవి గొంతు కోసి, తలను నరికి హత్య చేశాడు. అనంతరం ఆమె తలను తీసుకుని పరారయ్యాడు.

Son Murdered Mother By Slitting Her Throat :
దర్యాప్తు చేపట్టిన పోలీసులు

మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఊరి బయట కమలా దేవి తలతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. మృతురాలి మరో కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్య హత్య
Husband Killed His Wife : మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్యను కొట్టి చంపాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగింది. గోరేగావ్​- మలద్​ స్టేషన్ల మధ్యలోని రైల్వే ట్రాక్​ పక్కన నివసించే మొయినుద్దీన్​, పర్వీన్​ దంపతుల మధ్య డబ్బు కోసం తీవ్ర వివాదం జరిగింది. ఈక్రమంలోనే ఆగ్రహించిన భర్త మొయినుద్దీన్​, పర్వీన్​ను దారుణంగా కొట్టారు. అనంతరం తీవ్ర గాయాలపాలైన పర్వీన్​ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరం దాటి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు మొయినుద్దీన్​ను మల్వానీలో పట్టుకున్నారు.

కన్నతల్లిని సూదితో పొడిచి హత్య.. స్వయంగా పోలీసులకు ఫోన్ చేసిన కొడుకు

యువకుడిని చంపి 400 ముక్కలు చేసిన తండ్రీకొడుకులు- 15 సంచుల్లో కుక్కి వివిధ ప్రాంతాల్లో వేసిన నిందితులు

Last Updated : Dec 10, 2023, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.