ETV Bharat / bharat

పక్షవాతంతో బాధపడుతున్న కొడుకును చంపిన తండ్రి! - కొడుకును చంపిన తండ్రి

Paralysed Son killed by father: అనారోగ్యంతో బాధపడుతున్న కన్న కొడుకునే కడతేర్చాడు ఓ కిరాతక తండ్రి. పక్షవాతం మంచం పట్టిన కుమారుడిని కర్రతో చితకబాదాడు. తీవ్ర గాయాలైన బాధితుడు.. ప్రాణాలు కోల్పోయాడు. దిల్లీలోని భరత్ నగర్ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన.

Son Death
Son Death
author img

By

Published : Jan 10, 2022, 1:17 PM IST

Paralysed Son killed by father: పక్షవాతంతో బాధపడుతున్న కుమారుడి ఆలనాపాలనా చూసుకోవాల్సిన తండ్రే.. కడతేర్చాడు. మద్యం మత్తులో ఇంటికెళ్లి నిస్సహాయ స్థితిలో ఉన్న కొడుకును చితకబాది.. హతమార్చాడు. ఈ విషాద ఘటన దిల్లీలోని భరత్​ నగర్​ ప్రాంతంలో వెలుగుచూసింది.

పోలీసుల వివరాల ప్రకారం..

మృతుడి పేరు పరమ్​జీత్. అతను 14 ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఎటూ కదల్లేని పరిస్థితుల్లో మంచాన పడ్డాడు. పరమ్​జీత్​ వ్యక్తిగత పనులు కుటుంబ సభ్యులే చూసేవారు. అయితే ఆదివారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన అతడి తండ్రి అజ్మీర్​ సింగ్​​.. కొడుకుపై కర్రతో దాడి చేశాడు.

కాసేపటి తర్వాత పరమ్​జీత్​ సోదరి ఇంటికి వెళ్లేసరికి.. అతను తీవ్ర గాయాలతో మంచంపై ఉన్నాడు. తన సోదరికి జరిగిందంతా వివరించాడు. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన పరమ్​జీత్​ను ఆమె దీప్​ చంద్​బందన్​ ఆస్పత్రికి తరలించింది. అయితే ఆస్పత్రికి వెళ్లేసరికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రికి చేరుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మరో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. అజ్మీర్​ను అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: రెండు నెలల పసికందును ఎత్తుకెళ్లిన కోతి.. నీటి డ్రమ్ములో పడేసి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.