Six People Died in AP Due to Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురి గుండెలు ఆగిపోయాయి. టీవీల్లోనూ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు వార్తలు చూస్తూ గుండెపోటుతో కుప్పకూలారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మరో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం ధర్మపురం టీడీపీ నాయకుడు, వార్డు సభ్యుడు వడ్డే ఆంజనేయులు(65) టీవీలో చంద్రబాబు అరెస్టు చేయడం చూసి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. 30 ఏళ్ల నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్న ఆయన ఇటీవల జరిగిన పంచాయతీ వార్డు సభ్యుల ఉప ఎన్నికలో టీడీపీ మద్దతుదారుగా పోటీ చేసి విజయం సాధించారు.
Dr. BR Ambedkar Konaseema District: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన చెల్లుబోయిన నరసింహరావు (62) ఆకస్మికంగా మరణించారు. నరసింహారావు వార్తలు చూస్తుండగా చంద్రబాబు అరెస్టు అయినట్లు విని ఒక్కసారిగా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనై గుండెపోటుకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాట్రేనికోన మండలం రామస్వామి తోటలో సెల్‌ఫోన్‌లో వార్తలు చూస్తూ చంద్రబాబు అరెస్టు గురించి తెలుసుకుని కాకర సుగుణమ్మ(65) అనే మహిళ గుండెపోటుతో మరణించారు.
Vizianagaram District. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం జిన్నాంకు చెందిన సీనియర్ తెలుగుదేశం కార్యకర్త ఇజ్జిరోతు పైడితల్లి (67).. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గజపతినగరంలో నిర్వహించే ఆందోళనకు బయల్దేరుతుండగా గుండెనొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
Krishna District.. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం తాడేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త కొడాలి సుధాకరరావు(60) చంద్రబాబు అరెస్టు వార్తను టీవీలో చూస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయన్ను వెంటనే కూచిపూడిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Tirupati District.. చంద్రబాబును అరెస్టు చేశారని తెలిసి తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం తంగేళ్లపాళెం ఎస్సీ కాలనీకి చెందిన టీడీపీ అభిమాని వెంకటరమణ (46) ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలారు. తిరుపతి స్విమ్స్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భార్య హైమావతి ఎంపీటీసీ మాజీ సభ్యురాలు.
Woman Committed Suicide in Bapatla district.. బాపట్ల జిల్లా రేపల్లెలో పోలీస్‌స్టేషన్ ఎదుట యరగళ్ల మంగమ్మ అనే టీడీపీ మహిళా కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు వచ్చి ఆమెను నిలువరించారు. చంద్రబాబును వదలకుంటే నేను చచ్చిపోతాను సారూ.. చంద్రన్నను వదిలేయండి అంటూ ఆమె నినదించారు.
Man Committed Suicide by Pouring Petrol in Kurnool District.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని నాలుగు స్తంభాల కూడలిలో టీఎన్‌ఎస్‌ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు మునినాయుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.