ETV Bharat / bharat

మరో ఏడాది పాటు ఈడీ డైరెక్టర్​గా ఎస్​కే మిశ్రా

రెవెన్యూ శాఖకు చెందిన నిఘా సంస్థ ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ఛీఫ్​గా ఎస్​కే మిశ్రాను మరో ఏడాది కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నియామక పత్రంలో సవరణలు చేసింది.

ED_SK Mishra
మరో ఏడాది పాటు ఈడీ డైరెక్టర్​గా ఎస్​కే మిశ్రా
author img

By

Published : Nov 14, 2020, 4:56 PM IST

సంజయ్​ కుమార్ మిశ్రాను మరో ఏడాది పాటు ఈడీ డైరెక్టర్​గా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు.. 2018లో మిశ్రాను డైరెక్టర్​గా నియమిస్తూ జారీ చేసిన నియామక పత్రంలో సవరణ చేసింది.

2018, నవంబర్ 19న ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ ఛీఫ్​గా నియమితులైన మిశ్రా(60)...1984 బ్యాచ్​కు చెందిన ఐఆర్​ఎస్​ ఆధికారి.

సాధారణంగా ఈడీ ఛీఫ్​ పదవీకాలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ, మిశ్రాను మరో ఏడాది డైరెక్టర్​గా కొనసాగించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన రెవెన్యూ డిపార్ట్​మెంట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి అనుమతి పొందాకే ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:దీటుగా బదులిస్తాం.. పాక్‌, చైనాకు మోదీ హెచ్చరికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.