ETV Bharat / bharat

రాజస్థాన్​లో దారుణం- ఆరేళ్ల బాలికపై అత్యాచారం - రాజస్థాన్​ రేప్ ఘటనలు

రాజస్థాన్​లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో మైనర్లపై అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ యువకుడు. మరో ఘటనలో 15 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కామాంధులు.

Six-year-old girl raped in Rajasthan's Pushkar, one held
రాజస్థాన్​లో దారుణం- ఆరేళ్ల బాలికపై అత్యాచారం
author img

By

Published : Mar 17, 2021, 1:55 PM IST

రాజస్థాన్​లోని పుష్కర్​లో ఓ అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 23 ఏళ్ల యువకుడు. ఈ సమాచారం అందిన వెంటనే నిందితుడిని అరెస్టు చేసినట్లు అజ్మేర్ ఎస్​పీ జగ్​దీష్ చంద్ర శర్మ తెలిపారు. పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

20 మంది అరెస్టు..

రాజస్థాన్​లోని జలావర్ ప్రాంతంలో ఓ మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలో 20 మందిని అరెస్టు చేశారు పోలీసులు.

"సుకేత్​కు చెందిన 15 ఏళ్ల బాలికను జలావర్ ప్రాంతానికి తీసుకెళ్లి 7,8 రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ ఘటనకు సంబంధించి 20 మందిని అరెస్టు చేశాం. నిందితులందరూ జలావర్​ వాసులే."

--శరద్ చౌదరి, ఎస్​పీ

ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్​పీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'నిజమైన డిగ్రీలు ఉన్నందుకే వారికి శిక్ష'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.