జమ్ముకశ్మీర్ దోడాలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. బతుత్-కిష్టవర్ జాతీయ రహదారిపై రాగి నాలా వద్ద ఈ ఘటన జరిగింది. ఓ మైనర్ సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు.
దోడా నుంచి జమ్ముకు వెళుతుండగా.. వీరి వాహనం అదుపు తప్పి 500 అడుగుల లోయలో పడిపోయింది. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ మైనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద వార్త తెలుసుకుని ఖైర్ అనే స్వచ్ఛంద సంస్థ వలంటీర్లు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడ్డ మైనర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ చదవండి:ఎడతెగని ఎదురుచూపులు- ఆవిరవుతున్న ఆశలు