ETV Bharat / bharat

భార్య జననాంగాల్లోకి కర్ర చొప్పించి హత్య.. వివాహేతర సంబంధం పెట్టుకుందని... - భార్య మర్మాంగాలలో కర్ర చొప్పిన భర్త

భార్యపై అనుమానంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను చంపి.. తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Singrauli Wife murder Case
murder
author img

By

Published : Dec 22, 2022, 8:42 PM IST

భార్యపై అనుమానంతో ఊగిపోయిన ఓ భర్త ఆమెను అతి దారుణంగా హతమార్చాడు. రహస్య భాగాల్లోకి కర్ర చొప్పించి మరీ హత్య చేశాడు. ఆ తర్వాత అతడు సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని సింగ్రౌలి జిల్లాలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్​ మాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్హియా గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి తన భార్యపై అనుమానం వచ్చింది. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుమానించిన అతడు.. బుధవారం ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీయడంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి.. తన భార్య జననాంగాలలోకి ఓ కర్రను చొప్పించాడు. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.