సింఘు సరిహద్దులో దళిత యువకుడి హత్య కేసులో (Singhu border lynching case) పోలీసులు నలుగురునిందితుల్ని అరెస్టు చేశారు. ముందుగా లొంగిపోయిన నిహాంగ్ సిక్కు సభ్యుడు సరబ్‌జీత్ సింగ్‌ను పోలీసులు సోనిపట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితుడికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. మరో నిందితుడు నారాయణ్ సింగ్‌ను పంజాబ్‌లోని అమర్ కోట్‌లో అరెస్ట్ చేశారు. గోవింద్ సింగ్, భగవంత్‌సింగ్ అనే మరో ఇద్దరిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
పంజాబ్‌లోని తార్న్‌తరన్ జిల్లాలోని చీమ ఖుర్ద్ గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ హతుడు లఖ్‌బీర్ అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులను మినహా ఎవరికీ అనుమతివ్వలేదు. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసినందుకే లఖ్‌బీర్ సింగ్‌ను హత్యచేసినట్లు విచారణలో నిందితులు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ జరిగింది:
రైతు ఆందోళనలు జరుగుతున్న సింఘు సరిహద్దులో దారుణంగా హత్య (Singhu border lynching case) జరిగింది. 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి చేయిన నరికి, బారికేడ్‌లకు వేలాడదీశారు. శుక్రవారం ఉదయం ఈ వార్త కలకలం రేపింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:రైతు నిరసనల ప్రాంతంలో దారుణ హత్య.. అర్ధనగ్నంగా మృతదేహం