MLA Ramesh Latke: మహారాష్ట్ర శాసనసభ్యుడు, శివసేన నేత రమేశ్ లట్కే హఠాన్మరణం చెందారు. అంధేరీ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రమేశ్.. దుబాయ్లో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లినట్లు రాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్ తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారని పేర్కొన్నారు. లట్కే కుటుంబసమేతంగా దుబాయ్ వెళ్లారని.. వారిని భారత్ రప్పించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు అనిల్.
![Shiv Sena MLA Ramesh Latke dies of heart attack in Dubai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-mum-mlalatkedeath-7210570_12052022061238_1205f_1652316158_486.jpg)
ఇవీ చూడండి: కూతురి కోసం 30ఏళ్ల పాటు 'మగాడి'లా మారిన తల్లి