గాల్‌బ్లాడర్ శస్త్రచికిత్స కోసం ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. గురువారం డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత, మంత్రి నవాబ్ మాలిక్ వెల్లడించారు.
పవార్‌కు బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యులు.. శస్త్రచికిత్సను సోమవారం విజయవంతంగా నిర్వహించారు. అనంతరం.. రెండు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనను గురువారం డిశ్చార్జి చేశారని మాలిక్ తెలిపారు. కొన్ని రోజుల పాటు పవార్ తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు.
గత నెలలో కడుపునొప్పితో శరద్ పవార్ ఆసుపత్రిలో చేరారు. దాంతో మార్చి 30న ఎండోస్కోపీ చేసిన వైద్యులు ఆయన గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ రాళ్లను తొలగించారు.
ఇదీ చూడండి:ఆ రాష్ట్ర మంత్రికి రెండోసారి కరోనా పాజిటివ్
ఇదీ చూడండి:పోలింగ్‌కు ముందు కాంగ్రెస్ అభ్యర్థి మృతి