కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఉద్దేశించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేరళలో బంగారం, డాలర్ స్మగ్లింగ్ కేసులకు సంబంధించి ముఖ్యమంత్రిపై ప్రశ్నలు సంధించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్డీయే ప్రభుత్వం చేతిలో రాజకీయ సాధనాలుగా మారిపోయాయంటూ విజయన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
"బంగారం స్మగ్లింగ్ రాకెట్లలో ప్రధాన నిందితురాలు గతంలో మీ కార్యాలయంలో పని చేయలేదా?. అలాగే ప్రధాన నిందితురాలికి విజయన్ మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఓ ప్రభుత్వ ప్రాజెక్టులో కీలక పదవి అప్పగించారా? లేదా?"
-- అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి
గతేడాది వెలుగు చూసిన బంగారం స్మగ్లింగ్ కేసుల్లో అరెస్టయిన స్వప్న సురేశ్‌ను ఉద్దేశిస్తూ షా ఈ ప్రశ్నలు సంధించారు.
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో భాజపా చేపట్టిన 'విజయ యాత్ర' ముగింపు సందర్భంగా షంగుముగంలో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములపైనా ఆయన పలు విమర్శలు చేశారు.
ఇదీ చదవండి : 'నేనో కోబ్రా.. ఒకే కాటుకు అంతం చేస్తా'