ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​లో మరో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ కారు.. 5 మంది దుర్మరణం! - ఉత్తరాఖండ్​లో లోయలో పడిన కారు న్యూస్

ఉత్తరాఖండ్​లో ఘోర ప్రమాదం జరిగింది. కారు లోయలో పడిపోవడం వల్ల ఐదుగురు మృతిచెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

Five killed as car falls into gorge in Uttarakhand
ఉత్తరాఖండ్​ లోయలో పడిన కారు, మృతి చెందిన వ్యక్తులు
author img

By

Published : Nov 19, 2022, 3:46 PM IST

Updated : Nov 19, 2022, 5:08 PM IST

ఉత్తరాఖండ్​లో మరో ఘోర ప్రమాదం జరిగింది. చమోలి జిల్లాలో ఓ వాహనం లోతైన లోయలో పడి 12 మంది మరణించిన ఘటన మరువకముందే మరో ప్రమాదం జరిగింది. ధారసు-యముమోత్రి జాతీయ రహదారిపై ఉదయం 11 గంటల సమయంలో ఉత్తరకాశీ నుంచి పురోలా వెళ్తున్న వాహనం దాదాపు 400 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది.

గాయపడిన మహిళను మొదట బ్రహ్మఖాల్‌లోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఉత్తరకాశీ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరగడానికి కారణాలేంటో ఇంకా తెలియలేదు. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే వాహనం లోయలో పడిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి : ఉత్తరాఖండ్​లో మరో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ కారు.. 5 మంది దుర్మరణం!

19ఏళ్ల మోడల్​పై దారుణం.. కారులో నగరమంతా తిప్పుతూ గ్యాంగ్​రేప్

Last Updated : Nov 19, 2022, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.