ETV Bharat / bharat

అత్యాచారం విఫలయత్నం- ఆపై హత్యాయత్నం! - Superintendent of Police

ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్​పుర్​లో జాతీయ రహదారి పక్కన ఒంటినిండా కాలిన గాయాలతో, అచేతనావస్థలో కనిపించిన విద్యార్థిని కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. అయితే.. ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి కాస్త కుదుటపడింది. తనపై అత్యాచారం చేయబోయిన ముగ్గురిని అడ్డుకోగా.. వారు నిప్పింటించారని బాధితురాలు చెబుతోంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. తమ దర్యాప్తులో ఆమె పొంతనలేని వాంగ్మూలాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.

Set on fire after failed gang rape attempt, says UP college student
అత్యాచారం విఫలయత్నం- ఆపై కిరోసిన్ పోసి హత్యాయత్నం!
author img

By

Published : Feb 24, 2021, 8:07 PM IST

Updated : Feb 24, 2021, 8:30 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్​పుర్​లో లఖ్‌నవూ-బరేలీ జాతీయ రహదారి పక్కన 60 శాతం కాలిన గాయాలతో, నగ్నంగా పడి ఉన్న యువతి కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రైఖేదా ప్రాంతం వద్ద పంటపొలాల సమీపంలో ఆమె పడి ఉందని సమాచారం అందిన అనంతరం.. పోలీసులు బాధితురాలిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం.. లఖ్‌నవూలోని వేరే ఆసుపత్రికి తరలించారు.

కిరోసిన్​ పోసి.. నిప్పంటించి..!

బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని.. వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ఆ యువతిని ప్రశ్నించారు పోలీసులు. ఆమె తరచూ తన వాంగ్మూలాన్ని మార్చుకుంటోందని పోలీసులు తెలిపారు. తనపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నించిన ముగ్గురిని అడ్డుకోగా.. వారు కిరోసిన్​ పోసి నిప్పంటించారని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

Set on fire after failed gang rape attempt, says UP college student
బాధితురాలు అచేతనావస్థలో పడి ఉన్న ప్రదేశం

పొంతనలేని వాంగ్మూలాలు..!

కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్​ ఆధ్వర్యంలోని ముముక్షు ఆశ్రమం నిర్వహిస్తున్న స్వామి సుఖ్​దేవానంద్​ కళాశాలలో ఆమె బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

విద్యార్థిని చదివే కళాశాల

అయితే.. కళాశాల భవనంలోని మూడో అంతస్తు నుంచి ఆసుపత్రికి ఎలా చేరుకుందో తనకు తెలియలేదని ఆ యువతి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలో మాత్రం.. మూడో అంతస్తు నుంచి ఆమె ఒంటరిగానే నడుస్తూ కనిపించిందని స్పష్టం చేశారు పోలీలుసు.

''సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. కళాశాలలోకి ప్రవేశించిన 20 నిమిషాలకు ఆ విద్యార్థిని క్యాంపస్​లో విరిగిన గోడ మార్గం ద్వారా బయటికి వెళ్లింది. ఆ తర్వాత కెనాల్​ రోడ్​ వెంబడి ఒంటరిగానే నడిచింది.''

- ఆనంద్​, ఎస్పీ

అంతకుముందు ఆ యువతి.. తన స్నేహితులతో మాట్లాడటం, లైబ్రరీలోకి వెళ్లడం సీసీటీవీల్లో కనిపించిందని ఎస్పీ తెలిపారు.

ముమ్మర దర్యాప్తు..

ఈ వ్యవహారంపై దర్యాప్తునకు మూడు వేర్వేరు బృందాలను నియమించారు. ఘటనకు సంబంధించి.. ఆమె స్నేహితులు సహా కళాశాల విద్యార్థులనూ ప్రశ్నించారు పోలీసులు. ఘటన జరిగిన రోజు.. విద్యార్థిని తన ఊళ్లోని ఓ వ్యక్తితో ఫోన్​లో మాట్లాడిందని, అతడిని కూడా విచారించినట్లు తెలిపారు.

ఆ విద్యార్థిని వివస్త్రగా పడి ఉన్న ప్రదేశంలో.. కొన్ని గ్లాస్​లు కనిపించాయని, అయితే.. మద్యం ఆనవాళ్లు అక్కడ కనిపించలేదని తెలిపారు.

విద్యార్థిని పూర్తిగా కోలుకున్నాక.. ఆమెను అన్ని కోణాల్లో ప్రశ్నించి విచారణ వేగవంతం చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: భార్యను గర్భవతి చేసిన భర్త అరెస్ట్​

Last Updated : Feb 24, 2021, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.