ఉపాధి కల్పించిన బ్యాంకుకే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. సెక్యూరిటీ గార్డుగా మూడేళ్లుగా నమ్మకంగా పని చేసి ఒక్కసారిగా తన దుర్బుద్ధిని బయటపెట్టాడు. రూ.4.04 కోట్లను దొంగతనం చేసి పరారయ్యాడు. ఈ ఘటన పంజాబ్‌లోని ఛండీగఢ్ నగరంలో జరిగింది.
ఇదీ జరిగింది..
మొహాలీకి చెందిన సుమిత్.. ఛండీగఢ్ సెక్టార్-34లోని యాక్సిస్ బ్యాంక్‌లో గత మూడేళ్లుగా సెక్యురిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఏటీఎంలకు డబ్బులు పంపడానికి బ్యాంకులో పెట్టెల్లో డబ్బులను ఉంచుతారు. అందులో ఒక పెట్టెలో డబ్బును సుమిత్ దొంగిలించాడు. ఈ చిత్రాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
కేసు నమోదు చేసిన సెక్టార్-34 స్టేషన్ పోలీసులు నిందితున్ని పట్టుకోవడానికి గాలింపు చేపట్టారు.
ఇదీ చదవండి: చెల్లిని చంపి.. అన్న అండతో అడవిలో పూడ్చిన బాలుడు