ETV Bharat / bharat

Covaxin Omicron: 'ఒమిక్రాన్​పై ఆ టీకాల కంటే కొవాగ్జిన్​ బెస్ట్​' - కొవాగ్జిన్ సమర్థతపై ఐసీఎంఆర్​ వ్యాఖ్యలు

Covaxin Omicron: ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై మిగతా టీకాల కంటే భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ మెరుగ్గా పని చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇతర వ్యాక్సిన్ల కంటే కొవాగ్జిన్‌ కాస్త ఎక్కువ ప్రభావం చూపనున్నట్లు చెబుతున్నారు. మృత వైరస్‌ సాంకేతికత ఆధారంగా తయారైన కొవాగ్జిన్‌.. కొవిడ్‌ వేరియంట్లను కూడా సమర్థంగా ఎదుర్కోగలదని అంటున్నారు.

Covaxin Omicron
Covaxin Omicron
author img

By

Published : Dec 3, 2021, 7:18 PM IST

Covaxin Omicron: ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై కొవాగ్జిన్‌ టీకా.. ఇతర టీకాల కంటే బాగా పని చేసే అవకాశం ఉందని ఐసీఎంఆర్​ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రవర్తన గురించి ఇప్పటివరకు పెద్దగా తెలియనప్పటికీ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల కంటే కొవాగ్జిన్‌ సమర్థంగా పని చేసే అవకాశం ఉందని ఐసీఎంఆర్​ సీనియర్​ అధికారి డాక్టర్‌ సమీరన్‌ పాండా తెలిపారు.

తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌.. గత కొవిడ్‌ వేరియంట్ల కంటే ఎక్కువ మ్యూటేషన్లకు గురవుతోంది. స్పైక్‌ ప్రొటీన్‌ ఆధారంగా తయారైన ఫైజర్‌, మోడెర్నా వంటి mRNA వ్యాక్సిన్ల కంటే కొవాగ్జిన్‌తో కలిగే రోగ నిరోధకశక్తి నుంచి ఒమిక్రాన్‌ వేరియంట్‌ తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువ అని ఐసీఎంఆర్​ శాస్త్రవేత్తలు తెలిపారు.

'ఇతర టీకాల కంటే బాగా పని చేస్తుంది'

ICMR Covaxin Efficacy: ఫైజర్, మోడెర్నా వంటి mRNA టీకాలను కణం లోపల స్పైక్ ప్రోటీన్‌లో కొంతభాగాన్ని ఉత్పత్తి చేసే విధంగా రూపొందించారు. దాని ఆధారంగా వైరస్‌ను శరీరం గుర్తిస్తుంది. ఐతే ఒమిక్రాన్‌లో 50 మ్యుటేషన్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకు స్పైక్ ప్రోటీన్, దాని రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌పై(ఆర్​బీడీ) ఉన్నాయి. డెల్టా వేరియంట్‌లో ఆర్​బీడీపై రెండు మ్యుటేషన్లు ఉండగా.. ఇక్కడ పది వరకు ఉన్నాయి. వైరస్‌ నిర్మాణం మార్పు చెందితే.. mRNA వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయన్నది ప్రశ్నార్థంగా మారినట్లు డాక్టర్‌ పాండా తెలిపారు. అదే కొవాగ్జిన్‌ విషయానికొస్తే వైరస్‌పై సమర్థంగా ప్రభావం చూపుతుందన్నారు. ఒకేసారి మూడు వేర్వేరు సంభావ్య ప్రాణాంతక ప్రదేశాలపై కొవాగ్జిన్‌ ప్రభావం చూపుతుందన్నారు. అయినప్పటికీ వేరియంట్లకు అనుగుణంగా సర్దుబాటుచేసే గుణం mRNA వ్యాక్సిన‌్లు కలిగి ఉంటాయని తెలిపారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి.. మిగతా వేరియంట్ల కంటే ఎక్కువగా ఉందా అనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న కేసుల సంఖ్య ఆధారంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని డాక్టర్‌ సమీరన్‌ పాండా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న టీకాలన్నీ రోగాన్ని మార్పు చేసేవే తప్ప.. తగ్గించేవి కాదనే విషయం అర్థం చేసుకోవాలన్నారు. దక్షిణాఫ్రికాలో టీకాలు వేసుకోని ఒమిక్రాన్‌ బాధితుల్లోనూ తేలికపాటి లక్షణాలే కనిపిస్తున్నట్లు అక్కడి వైద్య నిపుణుల ద్వారా తనకు తెలిసినట్లు పాండా పేర్కొన్నారు. ఇన్‌యాక్టివేటెడ్‌ వైరస్‌ సాంకేతికత ఆధారంగా కొవాగ్జిన్‌ను రూపొందించినందున ఒమిక్రాన్‌పై కొవాగ్జిన్‌ మిగిలిన టీకాల కంటే బాగా పని చేసే అవకాశం ఉందని కొవిడ్‌ టీకాలపై జాతీయ స్థాయి నిపుణుల బృందం సభ్యుడు, మరో సీనియర్‌ ప్రభుత్వ అధికారి తెలిపారు.

ఉత్పరివర్తనాలపై మెరుగ్గా..

స్పైక్‌ ప్రొటీన్‌ సహా వైరస్‌ అనేక మ్యుటేషన్లకు గురవుతుందని ఐసీఎంఆర్​ డీజీ బలరాం భార్గవ తెలిపారు. ఒమిక్రాన్‌కు అనుగుణంగా తమ టీకాను మార్చేందుకు ఫైజర్‌ ఆరు వారాల సమయం కావాలని చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే మృత వైరస్‌ సాంకేతికత ఆధారంగా రూపొందించిన కొవాగ్జిన్‌.. ఉత్పరివర్తనాలపై కూడా మెరుగ్గా పని చేస్తుందని అన్నారు. నిర్ధిష్ట ప్రదేశాల లక్ష్యంగా రూపొందించిన mRNA టీకాలు.. ఉత్పరివర్తనం చెందితే సరిగ్గా పని చేయలేకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: ఒమిక్రాన్​పై టీకాలు పని చేస్తాయా? నిపుణుల మాటేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.