ETV Bharat / bharat

రైతు నిరసనలపై భాజపా నేతల కీలక భేటీ - farmers protest on farm laws

Multiple pleas have been filed in the SC seeking a direction to authorities to immediately remove the farmers, saying commuters are facing hardships due to the road blockades and the gatherings might lead to an increase in the number of COVID-19 cases.

SC to hear pleas seeking removal of protesting farmers from Delhi borders
22వ రోజు రైతుల నిరసన-సుప్రీంలో విచారణ
author img

By

Published : Dec 17, 2020, 9:51 AM IST

Updated : Dec 17, 2020, 8:06 PM IST

19:13 December 17

సుప్రీంకోర్టులో కేసుపై చర్చించిన రైతు సంఘాలు

  • నలుగురు సీనియర్ న్యాయవాదులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం
  • కమిటీ ఏర్పాటు ప్రతిపాదనపై న్యాయవాదుల సలహా తర్వాతే స్పందిస్తాం
  • చర్చలు జరిగినా.. సమాంతరంగా ఆందోళనలు ఉంటాయి
  • కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నదే మా ప్రధాన డిమాండ్
  • సాగు చట్టాలు రద్దు చేయకుండా ఆందోళన విరమించే ప్రసక్తే లేదు
  • రైతుల ఆందోళనల పట్ల కేంద్రం మొండి వైఖరి దారుణం
  • రోజుకో వాదనతో కేంద్రం రైతులను కించపరుస్తోంది
  • ఈ నెల 22న ముంబయిలో మరో పెద్ద ర్యాలీ నిర్వహిస్తాం
  • చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తాం

15:49 December 17

రైతు నిరసనలతో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించడమే లక్ష్యంగా భాజపా చర్చోపచర్చలు సాగిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ దిల్లీలో సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 

14:03 December 17

సుప్రీం ఏమందంటే..

అత్యున్నత న్యాయస్థానంలో విచారణ పూర్తయ్యే వరకు చట్టాల అమలుపై ఎలాంటి కార్యనిర్వాహక చర్యలు తీసుకోమని హామీ ఇవ్వగలరా అని అటార్నీ జనరల్​ను అడిగారు సీజేఐ. ఎలాంటి కార్యనిర్వాహక చర్యలు అని అడిగిన ఏజీ వేణుగోపాల్​.. దీని వల్ల రైతులు చర్చలకు రారని కోర్టుకు తెలిపారు. 

అయితే.. ఇది కూడా చర్చలు జరిగేందుకు ఓ మార్గమని సుప్రీం కోర్టు తెలిపింది.  ​

అన్ని రైతు సంఘాల వాదనల తర్వాతే కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతు ప్రతినిధుల పూర్తి వాదనల తర్వాత తుది ఉత్తర్వులిస్తామని పేర్కొంది. వారి వాదనలు వినేందుకు అన్ని రైతు సంఘాలకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపింది. కేసు విచారణను శీతాకాల బెంచ్​కు బదిలీ చేస్తామని సీజేఐ వ్యాఖ్యానించారు. 

14:02 December 17

  • రైతు సంఘాల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు
  • భారతీయ కిసాన్ యూనియన్ తరఫున న్యాయవాది ఎ.పి.సింగ్ వాదనలు
  • భారత్ రైతు ఆధారిత దేశం, బహుళజాతి సంస్థల ఆధారిత దేశం కాదు: సింగ్
  • లాక్‌డౌన్ సమయంలో ప్రజల ఆకలి తీర్చింది రైతులే: న్యాయవాది సింగ్
  • రోడ్లను దిగ్బంధిస్తే దిల్లీ ఆకలితో అలమటించాల్సి వస్తుందని పిటిషనర్ ఆరోపణ: సుప్రీం
  • నిరసన తెలియజేసే హక్కు రైతులకు ఉంది: సుప్రీంకోర్టు
  • ఏళ్ల తరబడి నిరసన చేస్తామనడం సరికాదు: సుప్రీంకోర్టు
  • దేశంలో రైతుల పరిస్థితి తమకు తెలుసన్న సుప్రీంకోర్టు
  • రైతుల సమస్యల పట్ల సానుభూతి సైతం ఉందన్న సుప్రీంకోర్టు
  • కేసు విచారణలో ఉండగా సాగు చట్టాలు అమలు చేయబోమని హామీ ఇవ్వగలరా?: సుప్రీం
  • హామీ ఇవ్వగలరా అని అటార్నీ జనరల్‌ను అడిగిన సుప్రీంకోర్టు
  • హామీ ఇవ్వలేనని సుప్రీంకోర్టుకు తెలిపిన అటార్నీ జనరల్

13:59 December 17

రైతులు చేపట్టిన నిరసనలను ప్రస్తుతానికి కొనసాగించవచ్చని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ఆస్తి, ప్రాణనష్టం జరగనంత వరకు నిరసనలు రాజ్యాంగబద్ధమేనని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. హింసాత్మక ఘటనలకు పాల్పడడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అయితే.. కేంద్రం, రైతులు చర్చలు జరపాలని, ఇరు పక్షాల వాదనలు వినేందుకు నిష్పాక్షిక, స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు పేర్కొంది. దేశరాజదాని చుట్టుపక్కల నిరసన చేస్తున్న రైతులను తరలించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

దిల్లీని దిగ్బంధిస్తే నగరంలో ఆకలికేకలు పెరుగుతాయని పిటిషనర్​ ఆరోపించినట్లు తెలిపింది సుప్రీం కోర్టు. కూర్చొని నిరసనలు చేస్తే ఏమొస్తుందని ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ బోబ్డే.. చర్చలే సమస్యకు పరిష్కారం అని స్పష్టం చేశారు. 

''మేం కూడా భారతీయులమే. రైతుల దుస్థితి మాకు తెలుసు. వారికి మా సానుభూతి తెలియజేస్తున్నాం. కానీ.. నిరసన చేసే విధానమే మారాలి. మేం మీ కేసును పరిశీలిస్తామని నిర్ధరిస్తున్నాం. అందుకే.. మేం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం.''

      - జస్టిస్బోబ్డే, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

13:56 December 17

  • దేశంలో రైతుల పరిస్థితి తమకు తెలుసన్న సీజేఐ
  • రైతుల సమస్యల పట్ల సానుభూతి సైతం ఉందన్న సీజేఐ
  • ఈ కేసు విచారణలో ఉండగా కొత్త సాగు చట్టాలు అమలు చేయమని హామీ ఇవ్వగలరా అని అటార్నీ జనరల్​ని అడిగిన సీజేఐ
  • అది కష్టమని చెప్పిన అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​
  • అన్ని రైతు సంఘాల వాదనల తర్వాతే కమిటీ ఏర్పాటుపై నిర్ణయం: సీజేఐ
  • రైతు ప్రతినిధుల పూర్తి వాదనల తర్వాత తుది ఉత్తర్వులిస్తామన్న సీజేఐ
  • వారి వాదనలు వినేందుకు అన్ని రైతు సంఘాలకు నోటీసులు జారీ చేస్తాం:సీజేఐ
  • కేసు విచారణ శీతాకాల వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేస్తామన్న సీజేఐ

13:52 December 17

13:40 December 17

  • రైతుల ఆందోళనతో రోడ్లు మూసుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే
  • చట్టాల రద్దు చేయాలని పట్టుదలతో రైతులు ఉన్నారన్న ఎస్​జీ
  • ఆరు నెలల వరకు నిరసనకు సిద్ధమయ్యే రైతులు వచ్చారు: ఎస్​జీ
  • దిల్లీ వచ్చే అన్ని రోడ్లను మూసివేశారా అని ప్రశ్నించిన సీజేఐ
  • సింఘూ, టిక్రి సరిహద్దులను పూర్తిగా మూసివేసినట్లు తెలిపిన ఎస్​జీ
  • రైతు సంఘాల తరపున వాదనలు ప్రారంభం
  • భారతీయ కిసాన్ యూనియన్ తరఫున న్యాయవాది ఏపీ సింగ్ వాదనలు
  • మనది రైతు ఆధారిత దేశం.. బహుళజాతి సంస్థల ఆధారిత దేశం కాదు : న్యాయవాది సింగ్​
  • లాక్​‌డౌన్ సమయంలో ప్రజల ఆకలి తీర్చింది రైతులే : సింగ్​
  • రోడ్లను దిగ్బంధిస్తే దిల్లీ ఆకలితో అలమటించాల్సి వస్తుందని పిటిషనర్ ఆరోపణ అన్న సీజేఐ
  • నిరసన తెలియజేసే హక్కు రైతులకు ఉంది : సీజేఐ
  • అయితే నిరసన ఉద్దేశం చర్చలతో సమస్య పరిష్కారం చేసుకోవడం : సీజేఐ
  • ఏళ్ల తరబడి నిరసన చేస్తామనడం సరికాదు: సీజే

13:29 December 17

రోడ్లను దిగ్బంధిస్తే ఏమొస్తుంది?

దిల్లీని దిగ్బంధిస్తే నగరంలో ఆకలికేకలు పెరిగిపోతాయని వ్యాఖ్యానించారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే. మాట్లాడుకోవడం ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. కూర్చొని నిరసనలు చేస్తే ఏమొస్తుందని అన్నారు. 

13:25 December 17

రైతులకు మాస్కుల్లేవ్​..

నిరసనలు చేస్తున్న రైతులెవరూ మాస్కులు ధరించట్లేదని, వారు గుంపులు గుంపులుగా ఉంటున్నారని సుప్రీం కోర్టుకు తెలిపారు అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​. ఇతరుల ప్రాథమిక హక్కులకు రైతులు భంగం కలిగిస్తున్నారని ఆయన తెలిపారు. 

కమిటీలో ఎవరుండాలో నిర్ణయించేది కేంద్రం, రైతుల చేతుల్లోనే ఉందని తెలిపారు పంజాబ్​ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్​ న్యాయవాది పి. చిదంబరం. రైతుల్లో ఎక్కువగా పంజాబ్​ నుంచే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 

13:07 December 17

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలను ప్రస్తుతానికి కొనసాగించవచ్చని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. దిల్లీ చుట్టుపక్కల ఆందోళనలు చేస్తున్న కర్షకులను అక్కడి నుంచి తరలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈమేరకు వ్యాఖ్యానించింది. 

"ఆస్తి, ప్రాణ నష్టం జరగనంత వరకు నిరసనలు రాజ్యాంగబద్ధమే. కేంద్రం, రైతులు చర్చలు జరపాలి. ఇరు పక్షాల వాదనలు వినేందుకు నిష్పాక్షిక, స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. ఆ కమిటీ చేసే సూచనలను పాటించాల్సి ఉంటుంది. అప్పటివరకు నిరసనలు కొనసాగించవచ్చు" అని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు.

నిరసన తెలియజేయడం రాజ్యాంగ హక్కు అని పేర్కొన్న సుప్రీం కోర్టు.. నిరసనల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీయకూడదు అని సూచించింది. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొంది.

''కేంద్రం, రైతు సంఘాలతో కమిటీ వేయాలనుకుంటున్నం. రైతు స్పందనలను వినాలనుకుంటున్నాం.'' అని సుప్రీం వ్యాఖ్యానించింది. 

హింసను ప్రేరేపించొద్దని రైతులకు స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. స్వతంత్ర కమిటీలో పి. సాయినాథ్​, భారతీయ కిసాన్​ యూనియన్​, ఇతర సభ్యులు ఉండొచ్చని సుప్రీం సూచించింది. 

12:10 December 17

సింఘూ సరిహద్దు వద్ద మరో రైతు మృతి

దిల్లీ-హరియాణా సింఘూ సరిహద్దు వద్ద మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్​కు చెందిన రైతు.. అక్కడ కాలువలో పడిపోయినట్లు సమాచారం. ఆస్పత్రికి తరలించగా.. మరణించినట్లు ధ్రువీకరించారు వైద్యులు. 

10:51 December 17

సాగు చట్టాల ఉపసంహరణే పరిష్కారం

  • కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాల డిమాండ్
  • ఇతర రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం సమాంతర చర్చలపై అభ్యంతరం
  • సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడమే సమస్యకు పరిష్కారం: రైతు సంఘాలు

09:38 December 17

22వ రోజు రైతుల నిరసన- సుప్రీంలో విచారణ

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన 22వ రోజూ కొనసాగుతోంది. దిల్లీ సరిహద్దుల్లోని సిక్రీ, సింఘూ ప్రాంతాల్లో అన్నదాతలు బైఠాయించారు. తమ ప్రయోజనాలను హరించే చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

సుప్రీం విచారణ..

మరోవైపు రైతుల నిరసనలపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ నేడు కూడా కొనసాగనుంది. అన్నదాతల సమస్యల పరిష్కారానికి రైతుసంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులతో ఒక కమిటీ వేసేందుకు యోచిస్తున్నట్లు బుధవారం విచారణ సందర్భంగా తెలిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ ప్రతినిధుల పేర్లు ప్రతిపాదించాలని సూచించింది. ఆందోళన చేస్తున్న రైతు సంఘాలను ఇంప్లీడ్‌ చేయాలని పిటిషనర్లకు సూచించిన ధర్మాసనం.. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.

Last Updated : Dec 17, 2020, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.