అవినీతి కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు ఊరట లభించింది. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికి అక్రమంగా భూమిని డినోటిఫై చేశారనే ఆరోపణలపై విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
క్రిమినల్ కేసును కొట్టివేయాలన్న పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు యడియూరప్ప. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఆయనపై విచారణను నిలిపివేయాలని ఆదేశించింది.
కేసు వివరాలు..
2008-12 మధ్య సీఎంగా ఉన్న యుడియూరప్ప.. పారిశ్రామిక అవసరాల కోసం బెంగళూరులోని హువినాయకనహళ్లి గ్రామంలో 20 ఎకరాల కేఐఏడీబీ భూమిని చట్టవిరుద్ధంగా డీనోటిఫై చేశారన్నది ప్రధాన ఆరోపణ.
ఇదీ చూడండి: 'నక్సలిజంపై విజయం తథ్యం'