ETV Bharat / bharat

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్​ శాంతన​గౌడర్ కన్నుమూత - సుప్రీం కోర్టు న్యాయమూర్తి

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ మోహన్ ఎం. శాంతన​గౌడర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గురుగ్రామ్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

SC judge Justice Mohan M Shantanagoudar
జస్టిస్​ శాంతన​గౌడర్
author img

By

Published : Apr 25, 2021, 2:27 AM IST

Updated : Apr 25, 2021, 10:30 AM IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మోహన్‌ ఎం.శాంతనగౌడర్‌ కన్నుమూశారు. ఆయన వయసు 62సంవత్సరాలు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో దిల్లీ శివారులోని గురుగ్రామ్​ మేదాంత ఆస్పత్రిలో చేరిన జస్టిస్‌ శాంతనగౌడర్‌ ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శనివారం రాత్రి వరకు న్యాయమూర్తి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారని సుప్రీంకోర్టు అధికారులు తెలిపారు. జస్టిస్‌ శాంతనగౌడర్‌కు కరోనా సోకిందా లేదా అన్నది వెల్లడించలేదు.

2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్‌ శాంతనగౌడర్‌ 1958 మే 8న కర్ణాటకలో జన్మించారు. 2003 మే 12న కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన ఆయన 2004లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

2016 ఆగస్టు ఒకటిన కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్‌ 22న కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు.

ఇదీ చదవండి : 'మహా' విలయం- ఒక్కరోజే 67వేల మందికి కరోనా

Last Updated : Apr 25, 2021, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.