ETV Bharat / bharat

కొవిడ్ ఆస్పత్రుల్లో తనిఖీలకు సుప్రీం ఆదేశాలు - కొవిడ్​-19

కొవిడ్ ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో పరిశీలించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

SC directs states to carry out fire safety audit of dedicated COVID-19 hospitals
కొవిడ్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక చర్యలపై సుప్రీం ఆదేశాలు
author img

By

Published : Dec 18, 2020, 1:02 PM IST

దేశంలోని కొవిడ్​-19 ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారో లేదో తనిఖీ చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవల కొన్ని ఆస్పత్రుల్లో భారీ ప్రమాదాలు జరిగి, ప్రాణనష్టం సంభవించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత ఆస్పత్రులు అగ్ని మాపక విభాగం నుంచి నాలుగు వారాల్లోగా ఎన్​ఓసీ ధ్రువపత్రాన్ని పొందాలని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. గడువులోగా ఎన్​ఓసీ పత్రం తీసుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఎన్​ఓసీ పత్రం గడువు ముగిస్తే తక్షణమే పునరుద్ధరించుకోవాలని సూచించింది.

ఇదీ చదవండి : కొవిడ్​ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.