Sarpanch candidate written test: ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా కుత్ర పంచాయతీలోని మాలుపాడా గ్రామంలో కొందరు వ్యక్తులు రాత పరీక్ష కోసం క్యూలో నిల్చున్నారు. అదేదో ప్రభుత్వ ఉద్యోగం కోసమో లేదా ఎంబీబీఎస్ సీటు కోసమో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించిన రాత పరీక్షలు అది.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తమ గ్రామానికి పోటీ పడే సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేయడానికి అక్కడి ఓటర్లు ఈ పరీక్ష పెట్టారు. అభ్యర్థుల విశ్వసనీయతపై అవగాహన కోసం ఇలా చేశారు. ప్రతి అభ్యర్థికీ ఏడు ప్రశ్నలు ఇచ్చారు. 'సర్పంచ్ అభ్యర్థిగా నీ ఐదు లక్ష్యాలు ఏంటి? సర్పంచ్‌గా గెలిస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తావు? గడిచిన ఐదేళ్లలో చేసిన సేవా కార్యక్రమాల వివరాలేంటి?' వంటి ప్రశ్నలకు సమాధానాలు లిఖితపూర్వకంగా తీసుకున్నారు.
మాలుపాడా గ్రామ సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న తొమ్మిది మంది అభ్యర్థుల్లో ఎనిమిది మంది పరీక్షకు హాజరయ్యారు. ఓటర్లు తయారు చేసిన ప్రశ్నాపత్రానికి సమాధానాలు రాశారు. ఇందులో ముగ్గురు మాత్రమే విజయవంతంగా పరీక్షలో పాసయ్యారు.
ఇదీ చదవండి: తెల్లారితే పెళ్లి.. వధువు బ్రెయిన్ డెడ్.. తల్లిదండ్రుల షాకింగ్ నిర్ణయం!