ETV Bharat / bharat

'నియమాలు ఉల్లంఘించారు' - రైతుబంధుకు సీఈసీ అనుమతి ఉపసంహణ

Rythu Bandhu
Rythu Bandhu
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 9:21 AM IST

Updated : Nov 27, 2023, 10:07 AM IST

09:19 November 27

రైతుబంధుకు ఇచ్చిన అనుమతి ఉపసంహరించుకున్న సీఈసీ

Rythu Bandhu Funds Release suspended : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే రైతుబంధు (Rythu Bandhu) నిధుల విడుదలకు.. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ముందు ఇలా అనుమతి ఇవ్వడంపై.. రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఇలా చేయడం ఓటర్లను ప్రలోభానికి గురి చేయడం లాంటిదేనని ధ్వజమెత్తాయి. బీఆర్ఎస్, బీజేపీలు ఒకటే అనడానికి ఇదే నిదర్శనమంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది.

CEC Withdraw Rythu Bandhu Funds Release Permission : ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబంధు నిధుల విడుదలకు ఇచ్చిన అనుమతిని.. తాజాగా ఉపసంహరించుకుంది. నియమాలు ఉల్లంఘించారని అందుకే అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎన్నికల ప్రచార సభలపై రైతుబంధు గురించి ప్రస్తావించరాదని.. అదేవిధంగా ఎన్నికల్లో లబ్ధిపొందేలా వ్యాఖ్యలు చేయరాదని సీఈసీ ముందే షరతు విధించింది. అయితే రైతుబంధుపై మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) వ్యాఖ్యలు నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. అందుకే అనుమతిని ఉపసంహరించుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

Rythu Bandhu Funds Releasing Today : నేటి నుంచి కర్షకుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ

CEC Break at Rythu Bandhu Distribution in Telangana : తెలంగాణలో యాసంగి సీజన్‌ కోసం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి.. సీఈసీ శుక్రవారం రాత్రి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 28 వరకు చెల్లింపులు చేపట్టాలని స్పష్టం చేసింది. 2018 అక్టోబరు ఐదో తేదీన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని నిర్దేశించింది. ఏటా రాష్ట్ర సర్కార్‌ పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5,000ల చొప్పున రెండు సీజన్‌లకు మొత్తం రూ.10,000లను అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.

How to Apply for Rythu Bandhu : 'రైతుబంధు'కు ఎలా దరఖాస్తు చేయాలి..? డబ్బులు పడ్డాయో లేదో ఎలా తెలుసుకోవాలి?

Telangana Assembly Elections 2023 : తెలంగాణలో వానాకాలంతో పాటు యాసంగి సీజన్‌ (Telangana Rythu Bandhu) ఆరంభానికి ముందు.. రాష్ట్ర సర్కార్‌ రైతుబంధు నిధులు విడుదల చేస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్‌కు నిధుల జమ జరగలేదు. ఇది కొనసాగుతున్న పథకమని కోడ్‌ వర్తించదని.. యథావిధిగా ఈ సాయం విడుదలకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం గత నెలలో సీఈసీని కోరుతూ లేఖ రాసింది. పరిశీలించిన ఈసీ మూడు రోజుల క్రితం నిధుల జమకు అనుమతులు ఇచ్చింది. 28 సాయంత్రానికి ప్రచార గడువు ముగుస్తున్నందున.. అప్పటి నుంచి ఈ నెల 30న పోలింగ్‌ ముగిసే వరకు నిధులను జమ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ అనుమతిని సీఈసీ ఉపసంహరించుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరణతో.. తెలంగాణలోని 70 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం నిలిచిపోనుంది.

Telangana Rythu Bandhu Funds 2023 : రైతుబంధు నిధుల విడుదల​.. రైతుల ఖాతాల్లో జమ

'రైతు బంధుని కాపీ కొట్టి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు'

Last Updated : Nov 27, 2023, 10:07 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.