ETV Bharat / bharat

నీళ్ల డ్రమ్ములకు తాళాలు.. ఇదేం దుస్థితి! - నీళ్లను దాచుకుంటున్న ప్రజలు

రాజస్థాన్​ అజ్​మేర్​ గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నీళ్లున్న డ్రమ్ములకు తాళాలు వేసి అక్కడి ప్రజలు దాచుకుంటున్నారు. అధికారులు తమ సమస్యకు పరిష్కారాన్ని చూపించాలని వారు కోరుతున్నారు.

lock to water
రాజస్థాన్​లో నీటి ఎద్దడి
author img

By

Published : Jun 11, 2021, 11:31 AM IST

Updated : Jun 11, 2021, 11:48 AM IST

నీళ్ల డ్రమ్ములకు తాళం

ఎవరైనా బంగారం, ధనాన్ని భద్రపరచాలంటే పెట్టెకు తాళాలు వేసి దాచుకుంటారు. కానీ, నీళ్లు ఉండే డమ్ముకు తాళమేసి దాచుకున్న సంఘటనలు ఎప్పుడైనా విన్నారా? రాజస్థాన్​ అజ్​మేర్​కు వెళితే ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది. నీటి కొరతతో అక్కడి గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటమే ఇందుకు కారణం. గడ్డు పరిస్థితుల్లో.. ఇతరులెవరూ నీళ్లను దొంగిలించకుండా ఉండేందుకే ఇలా తాళమేసి భద్రపరుస్తున్నామని వారు చెబుతున్నారు.

lock to water
నీటి డ్రమ్ముకు తాళమేసిన దృశ్యం
lock to water
అజ్​మేర్​లో నీటి ఇక్కట్లు
lock to water
నీళ్ల కోసం బిందెలు, క్యానులతో వస్తున్న మహిళ

"12ఏళ్లుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం. ప్రతి రెండు రోజులకు ఒకసారి నీళ్ల ట్యాంకర్​ ఇక్కడకు వస్తుంది. మేము మా క్యానుల్లో నీళ్లను నింపుకుని ఎవరూ ఎత్తుకెళ్లకుండా తాళాలు వేస్తున్నాం," అని స్థానిక మహిళ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: అయ్యో పాపం.. తాగునీరు లేక చిన్నారి మృతి

ఇదీ చూడండి: చేతిపంపు కొట్టి.. దాహం తీర్చుకున్న ఏనుగు

Last Updated : Jun 11, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.