గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసపై అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రైతుల ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ట్వీట్లు చేశారంటూ మధ్యప్రదేశ్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్కు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు నేతలు.
వీరితో పాటు ఈ కేసులో పేర్లు నమోదైన పాత్రికేయులు.. మృణాల్ పాండే, జాఫర్ ఆఘా, పరేశ్ నాథ్, అనంత్ నాథ్లు కూడా ఈ ఎఫ్ఐఆర్లను వ్యతిరేకిస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
డిజిటల్ ప్రసారాలు, సామాజిక మాధ్యామాల పోస్టుల ద్వారా వీరు.. హింసను ప్రేరేపించారని స్థానిక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జనవరి 30న.. ఈ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు దిల్లీ పోలీసులు. అంతకుముందు.. రైతుల ర్యాలీలో హింసకు కారణమయ్యారంటూ థరూర్ సహా.. ఆరుగురు పాత్రికేయులపై నోయిడా పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. జర్నలిస్టులు రాజ్దీప్ సర్దేశాయ్, మృణాల్ పాండే తదితర పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు.
ఇదీ చదవండి: దీప్ సిద్ధూపై సమాచారం ఇస్తే రూ.లక్ష రివార్డు