ETV Bharat / bharat

'మొతేరా' మైదానం పేరు మార్పుపై దుమారం - మోదీ స్టేడియం

మొకేపా మైదానానికి 'నరేంద్ర మోదీ' స్టేడియంగా నామకరణం చేయడంపై తీవ్ర దుమారం చెలరేగింది. స్టేడియం పేరు మార్చి దివంగత సర్దార్​ వల్లబ్​భాయ్​ పటేల్​ను భాజపా అవమానించిందని కాంగ్రెస్​ విమర్శించింది. కాంగ్రెస్‌ విమర్శలపై కేంద్ర ప్రభుత్వం దీటుగా స్పందించింది

motera
మొతేరా
author img

By

Published : Feb 25, 2021, 6:03 AM IST

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా గుర్తింపు పొందిన మొతేరా మైదానానికి 'నరేంద్ర మోదీ స్టేడియం'గా నామకరణం చేయడంపై బుధవారం దుమారం చెలరేగింది. సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ను ప్రభుత్వం అవమానించిందంటూ కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. వాటిని భాజపా తిప్పికొడుతూ పటేల్‌ గురించి కాంగ్రెస్‌ మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించింది. 'మొతేరా'కు గతంలో సర్దార్‌ పటేల్‌ స్టేడియంగా పేరుండేది. పునర్నిర్మాణం తర్వాత దాని పేరును 'నరేంద్ర మోదీ స్టేడియం'గా మార్చారు. స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ లాంఛనంగా ప్రారంభించేంతవరకూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. పేరు మార్పు సంగతి తెలియగానే కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేశారు. పటేల్‌ పేరును తొలగించడమంటే ఆయన్ను తీవ్రంగా అవమానించడమేనని కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ సతావ్‌ అన్నారు. "తమ మాతృసంస్థను నిషేధించిన వ్యక్తి పేరు మీద స్టేడియం ఉన్నట్లు వారికి ఇప్పుడే తెలిసినట్లుంది" అని శశి థరూర్‌ ట్విట్టర్‌ వేదికగా చురకలంటించారు.

స్టేడియానికి మాత్రమే మోదీ పేరు: కేంద్రం

కాంగ్రెస్‌ విమర్శలపై కేంద్ర ప్రభుత్వం దీటుగా స్పందించింది. మొతేరా స్టేడియానికి మాత్రమే మోదీ పేరు ఉంటుందని వివరణ ఇచ్చింది. అక్కడి క్రీడా సముదాయమంతా సర్దార్‌ పటేల్‌ పేరు మీద కొనసాగుతుందని స్పష్టం చేసింది. పటేల్‌ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. గుజరాత్‌లోని కేవడియాలో ఏర్పాటుచేసిన పటేల్‌ విగ్రహం ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన విగ్రహమైనా.. కాంగ్రెస్‌ అధ్యక్షరాలు సోనియా గాంధీగానీ, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీగానీ ఇప్పటివరకు దాన్ని సందర్శించనే లేదని పేర్కొన్నారు.

"క్రీడా సముదాయం పేరు సర్దార్‌ పటేల్‌ స్పోర్ట్స్‌ ఎన్‌క్లేవ్‌. ఆ సముదాయంలోని క్రికెట్‌ స్టేడియానికి మాత్రమే మోదీ పేరు పెట్టాం. పటేల్‌ మరణించాక కూడా ఆయన్ను ఎప్పుడూ గౌరవించని 'కుటుంబం' ఇప్పుడు ఆయనకు అవమానం జరిగిందంటూ రభస చేస్తుండటం విడ్డూరంగా ఉంది" అని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. మొతేరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడం ఆయన దార్శనికతను గౌరవించే ప్రయత్నంగా భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. మరోవైపు- మొతేరా ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడుతూ.. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ స్టేడియం పునర్నిర్మాణానికి మోదీ ప్రణాళికలు సిద్ధం చేశారని గుర్తు చేశారు.

నిజాలు బయటికొచ్చాయి

'మొతేరా' పేరును మార్చడంతోపాటు మైదానంలో రెండు ఎండ్‌లకు కార్పొరేట్‌ సంస్థలైన రిలయన్స్‌, అదానీల పేర్లు పెట్టడంపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం 'మేమిద్దరం - మాకిద్దరు' అన్నట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమిత్‌ షా కుమారుడు జయ్‌ షా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న సంగతిని గుర్తుచేశారు. "వాస్తవాలు అందంగా బయటపడ్డాయి. నరేంద్ర మోదీ స్టేడియం - అదానీ ఎండ్‌ - రిలయన్స్‌ ఎండ్‌. జయ్‌ షా సారథ్యం" అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 'మేమిద్దరం - మాకిద్దరు' అనే హ్యాష్‌ట్యాగ్‌ను దానికి జత చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.