మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని ఓ కొవిడ్ ఆసుపత్రిలో కొంత మంది వ్యక్తులు బీభత్సం సృష్టించారు. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ఓ మహిళ చనిపోగా.. ఆమె బంధువులు ఆగ్రహానికి లోనయ్యారు. సదరు మహిళ భర్త.. వైద్యులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం తన బంధువుల సాయంతో ఆసుపత్రిలోని రిసెప్షన్ ప్రాంతాన్ని ధ్వంసం చేశాడు.
పెట్రోల్‌తో ఆసుపత్రిలోని టేబుళ్లను తగలబెట్టేందుకు వారు యత్నించారు. అయితే.. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది.. మంటలను ఆర్పేశారు.
ఈ ఘటన దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీటీవీల్లో నమోదయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 11 మంది ఈ విధ్వంసానికి పాల్పడగా.. 10 మంది నిందితులను అరెస్టు చేశామని డీసీపీ లోహిత్ మతనీ తెలిపారు.