Relatives Carried Man Dead Body On Bike : అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల మృతదేహాన్ని 10 కిలోమీటర్లు బైక్ తీసుకెళ్లారు బంధువులు. ఈ హృదయ విదారక ఘటన ఒడిశాలోని అనుగుల్ జిల్లాలో మంగళవారం జరిగింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దువారీ గురు (60) అనే వ్యక్తి బాలసింగ అనే గ్రామంలో నివసిస్తున్నాడు. అతడు మంగళవారం ఆవులను మేపడానికి వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పిడుగు పాటుకు గురై కింద పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న దువారీని గమనించిన స్థానికులు.. అతడి బంధువులకు సమాచారం అందించారు. అనంతరం వారు అంబులెన్స్‌ను సంప్రదించారు. అంబులెన్స్ అందుబాటులో లేదని.. వేచి ఉండాలని కాల్ సెంటర్ నుంచి సమాధానం వచ్చింది. ఆ తర్వాత గంటలు గడిచినా అంబులెన్స్ రాలేదు. దీంతో చేసేదేమీలేక దువారీని స్థానికుల సహాయంతో అతడి బంధువులు సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే దువారీ చనిపోయాడు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని బైక్‌పై 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు.
కొడుకు మృతదేహాన్ని కవర్లో చుట్టి..!
కొంతకాలం క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. అంబులెన్స్ లేక ఏడాదిన్నర కుమారుడి మృతదేహంతో 70 కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ వ్యక్తి. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికాస్ఖండ్ మండలంలోని అడ్సేనా గ్రామంలో దారస్ రామ్ యాదవ్ అనే వ్యక్తి తన భార్య, ఏడాదిన్నర కుమారుడితో నివసిస్తున్నాడు. రామ్ యాదవ్ భార్య కుమారుడ్ని తీసుకుని తమ పొలానికి వెళ్లివ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది. ఇంతలో ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. చెరువులో నుంచి బాలుడ్ని అపస్మారక స్థితిలో బాలుడ్ని బయటకు తీసి.. హూటాహుటిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షల అనంతరం చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. చిన్నారికి పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించాలని వైద్యులు చెప్పారు. కుమారుడి మృదేహాన్ని తరలించేందుకు అంబులెన్సు ఏర్పాటు చేయాలని రామ్ యాదవ్ వైద్యులను కోరాడు. అయితే తమ వద్ద అంబులెన్స్ లేదని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
అంబులెన్స్ సిబ్బంది కర్కశత్వంతో మరో అమానవీయ ఘటన.. బైక్‌పైనే మరో మృతదేహం..