ETV Bharat / bharat

చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స.. ప్రాణాలు నిలిపిన వైద్యులు

Rare Surgery in Kerala: అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ చిన్నారిని రక్షించారు కేరళ వైద్యులు. శిశువు జీర్ణక్రియలో ఉత్పత్తి అయ్యే ద్రవం ఛాతీలోకి లీక్ అవుతుందని గుర్తించి ఆమె ప్రాణాలు కాపాడారు.

Infant saved throug a rare surgery
కేరళలో అరుదైన శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు
author img

By

Published : Feb 26, 2022, 3:33 PM IST

Rare Surgery in Kerala: ఛాతీ భాగంలో అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ చిన్నారిని రక్షించారు వైద్యులు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో జరిగింది.

కొట్టాయంకు చెందిన ఫేబిన్​-జెస్టీ దంపతులకు ఏడాదిన్నర శిశువు ఉంది. చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండగా.. ఆస్పత్రిలో చేర్చారు తల్లిదండ్రులు. పరీక్షల అనంతరం పాప ఛాతీ భాగంలో.. ఆహార నాళంలో ఉత్పత్తి అయ్యే శోషరస ద్రవం ఛాతీలోకి లీక్ అవుతున్నట్లు గుర్తించారు డాక్టర్లు. అరుదైన శస్త్రచికిత్సతో (ఎంబోలైజేషన్) ఆ లీక్​ను మూసివేసి చిన్నారిని కాపాడారు.

సాధారణంగా ఛాతీ భాగంలో ఆపరేషన్ చేయించుకున్నవారికి లేదా ఛాతీలో ట్యూమర్స్ ఉన్నవారిలో ఇలాంటి వ్యాధి లక్షణాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. కానీ నవజాత శిశువులో ఇలాంటి వ్యాధి రావడం చాలా అరుదని వెల్లడించారు.

ఇదీ చదవండి: 'కొవిడ్​ ఆంక్షలు సడలించండి'- రాష్ట్రాలకు కేంద్రం సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.