Rape Victim: కేరళలోని కొట్టాయంలో అమానవీయ ఘటన శుక్రవారం వెలుగుచూసింది. జాతకం చూస్తానంటూ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఆలయ పూజారి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇదీ జరిగింది..
ఇటీవల కుమార్తె జాతకం చూపించేందుకు తల్లిదండ్రులు.. బాధితురాలిని ఆలయ అర్చకుడు శిరీష్ వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో జాతకం చూస్తానంటూ ఆమెను వేరే గదికి తీసుకెళ్లిన నిందితుడు శిరీష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని కొన్ని రోజుల తర్వాత బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఘటనపై బంధువులు బాలల సంరక్షణ కమిటీని ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి : ఆటో ఛార్జీ ఇవ్వలేదని.. బాలికపై డ్రైవర్ అత్యాచారం