ETV Bharat / bharat

12 ఏళ్లకే తల్లైన బాలిక.. బహిర్భూమికి వెళ్లగా ఏడు నెలల క్రితం అత్యాచారం - పంజాబ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం

12 ఏళ్లకే గర్భం దాల్చింది ఓ బాలిక. శనివారం ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఏడు నెలల క్రితమే ఆ బాలిక గర్భం దాల్చినప్పటికీ.. ఆ విషయం ఆమెకు తెలియదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

rape-on-minor-girl-in-panjab-rape-victim-gave-birth-to-baby
12 ఏళ్ల బాలిక ఏడు నెలల క్రితం అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలు
author img

By

Published : May 27, 2023, 10:41 PM IST

12 ఏళ్ల అత్యాచార బాధితురాలు ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఏడు నెలల క్రితమే ఆ బాలిక గర్భం దాల్చినప్పటికీ.. ఆ విషయం ఆమెకు తెలియకపోవడం గమనార్హం. అప్పుడప్పుడు కడుపు నొప్పి వచ్చినా.. అనారోగ్యం కారణంగా భావించి మందులు ఇచ్చేవాడు బాధితురాలి తండ్రి. పంజాబ్​లో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్‌సర్‌లోని ఫగ్వారా పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివాసం ఉండే బాధితురాలు.. కడుపునొప్పితో బాధపడుతూ గురునానక్ దేవ్ హాస్పిటల్ వచ్చింది. బాలికకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆమె గర్భం దాల్చినట్లుగా నిర్ధరించారు. అనంతరం చిన్నారికి జన్మనిచ్చింది బాలిక. బాధితురాలు జన్మనిచ్చిన చిన్నారి.. కేవలం 800 గ్రాములు మాత్రమే ఉందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వారు వివరించారు. బాధితురాలి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. వెంటనే దీనిపై పోలీసులకు సమాచారం అందించారు వైద్యులు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలి నుంచి స్టేట్​మెంట్​ సైతం రికార్డ్​ చేసుకున్నారు.

తన కూతురు గత ఏడు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోందని బాధితురాలి తండ్రి తెలిపాడు. ఆమె కడుపునొప్పితో బాధపడినప్పుడల్లా.. మందులు​ ఇచ్చేవాడినని వివరించాడు. ఆసుపత్రికి వచ్చిన తరువాతే తన కూతురు గర్భవతి అని తెలిసిందన్నాడు. ఇంట్లో తాను, తన కూతురు మాత్రమే ఉంటామని తెలిపాడు. రెండు సంవత్సరాల క్రితం.. తన భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయిందని వెల్లడించాడు. దీనిపై బాధితురాలని ప్రశ్నించగా.. ఏడు నెలల కింద బహిర్భూమికి వెళ్లిన సమయంలో తనపై అత్యాచారం జరిగిందని తెలిపింది. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్​ చేస్తామని వారు వెల్లడించారు.

రేప్​ వల్ల బాలికకు గర్భం.. దగ్గరుండి ప్రసవం చేసిన తండ్రి..
అత్యాచారానికి గురైన బాలికకు పుట్టిన బిడ్డను అతి కిరాతకంగా చంపాడు ఓ వ్యక్తి. గుజరాత్ పఠాన్ జిల్లా​లో ఈ అమానవీయ జరిగింది. రేప్ కారణంగా గర్భం దాల్చిన​ కూతురికి స్వయంగా తండ్రే ప్రసవం చేసి.. పుట్టిన బిడ్డను గొంతు నులిమి చంపేశాడు. అంతటితో ఆగకుండా కత్తితో శిశువు మొండెం నుంచి తలను వేరు చేసి కాలువలో పడేశాడు. బాధిత బాలిక కొన్ని నెలల కిందట జిల్లాలోని ధేబెవాడి ప్రాంతంలో ఓ కామాంధుడి చేతిలో అత్యాచారానికి గురైంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం వల్ల అప్పటికే గర్భం దాల్చింది బాలిక. ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.